Publish Date: Thu, 18 Jun 2026 (19:16 IST)
Updated Date: Thu, 18 Jun 2026 (19:19 IST)
ఇటీవలి కాలంలో వీధి కుక్కలు విపరీతంగా జనంపై బడి కరుస్తున్న ఘటనలను మనం చూస్తూనే వున్నాం. కర్నాటక, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాలలో వీధి కుక్కలు కాటు వేయడంతో వందల మంది ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. ఆ సంగతి అలా వుంచితే నాలుగు వీధి కుక్కలను ఓ బుడ్డోడు వశం చేసుకుని వాటిపై సవారీ చేస్తున్నాడు. ఈ వీడియో ఇపుడు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది.
ఆ వీడియోలో బుడ్డోడు నాలుగు వీధి కుక్కలపై ఓ బండిని కట్టాడు. ఆ కుక్కలకు తాళ్లు కట్టి బండిపై ఎక్కి కూర్చుని చల్ చల్ అంటూ వాటిని తోలుకుంటూ వెళ్తున్నాడు. ఆ కుక్కలు రోడ్డుపై వర్షపు నీటిలో సైతం చక్కగా ఆ పిల్లవాడిని లాక్కెళుతూ వున్నాయి. ఈ వీడియోను చూసిన నెటిజన్లు క్రియేటివిటీ ఎవడు సొత్తు కాదు.. రాబోయే తరం ఆలోచనలు అంటూ కామెంట్లు చేస్తున్నారు.
కానీ చిన్నపిల్లల్ని కుక్కలతో ఇలాంటి సాహసాలు చేయించడం కరెక్ట్ కాదని మరికొందరు వ్యాఖ్యానిస్తున్నారు.