Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

దువ్వాడ శ్రీనివాస్ మిస్సింగ్ కేసు.. సస్పెన్స్ వీడింది.. ఎక్కడున్నారంటే?

Advertiesment
Divvela Madhuri
Divvela Madhuri
డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మీద అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ దువ్వాడ శ్రీనివాస్ మీద కేసులు నమోదైన సంగతి తెలిసిందే. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌పై అనుచిత వ్యాఖ్యల కేసు విచారణ కోసం దువ్వాడ శ్రీనివాస్ మంగళవారం ఉదయం కొత్తూరు పోలీస్ స్టేషన్ బయల్దేరినట్లు ఆయన అనుచరులు చెప్తున్నారు. 
 
మరోవైపు దువ్వాడ శ్రీనివాస్‌ను పోలీసులు అరెస్ట్ చేశారని దివ్వెల మాధురి ఆరోపిస్తున్నారు. మొత్తంగా ఈ వ్యవహారం స్థానికంగా కలకలం రేపుతోంది. అయితే దువ్వాడ శ్రీనివాస్ మిస్సింగ్ కేసులో సస్పెన్స్ వీడింది. ఆరోగ్యం బాగోలేదని, మూడు వారాల సమయం కావాలని ఆయన లాయర్ పోలీసులను కోరారు. దువ్వాడ మొబైల్ సిగ్నల్ ఒడిశాలోని బరంపురం వైపు చూపిస్తున్నట్లు సమాచారం ఇచ్చారు.
 
అంతకుముందు దువ్వాడ శ్రీనివాస్ సన్నిహితురాలు మాధురి స్పందిస్తూ.. ఉదయం ఇంటి నుంచి దువ్వాడ బయలుదేరిన తర్వాత మధ్యాహ్నం నుంచి ఆయన ఎక్కడ ఉన్నారో ఆచూకీ తెలియలేదని, పోలీసులే దువ్వాడను అదుపులోకి తీసుకుని ఉండొచ్చని ఆమె అనుమానం వ్యక్తం చేశారు.
 
అయితే, కొత్తూరు పోలీసులు ఈ ఆరోపణలను పూర్తిగా ఖండించారు. దువ్వాడ పోలీస్ స్టేషన్‌కు అసలు రాలేదని స్పష్టం చేశారు. ఆయనతో పాటు బయలుదేరిన పర్సనల్ పీఏ కూడా మార్గమధ్యంలో దిగిపోయినట్లు వెల్లడించారు.
webdunia
Duvvada Srinivas- Divvela Madhuri
 
ఈ పరిణామాల నేపథ్యంలో దువ్వాడ లాయర్ చేసిన ప్రకటనతో ఒడిశాలో మొబైల్ లొకేషన్ గుర్తించిన సమాచారం ఆధారంగా దువ్వాడ మిస్సింగ్ వ్యవహారంపై సస్పెన్స్ వీడింది. ప్రస్తుతం పోలీసులు ఈ వివరాలను పరిశీలించి తదుపరి చర్యలు చేపట్టనున్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

పెట్రోల్, డీజిల్ రిటైల్ అమ్మకాలపై తాత్కాలిక ఆంక్షలు ఎత్తివేత