Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

#ModiLeadingTheWorld ట్విట్టర్లో టాప్ ట్రెండ్, ఎందుకని?

Advertiesment
Modi Leading The World
, గురువారం, 9 ఏప్రియల్ 2020 (08:25 IST)
ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్ సృష్టిస్తున్న బీభత్సంతో అల్లాడిపోతోంది. అగ్రరాజ్యం అమెరికాలో తెల్లారితే ఎన్ని మరణాలు సంభవిస్తాయోనన్న భయంతో కొట్టుమిట్టాడుతోంది. ఫ్రాన్స్, స్పెయిన్, ఇంగ్లండ్ ఇలా అనేక దేశాల్లో కరోనా వైరస్ - కోవిడ్ 19 శరవేగంతో విస్తరిస్తోంది. ఐతే మన దేశంలో కరోనా వేగానికి కళ్లాలు వేయగలిగారని ప్రపంచ దేశాలు అంటున్నాయి. ఎవరెవరు ఏమన్నారంటే...
 
1. కరోనా వైరస్ నియంత్రణ విషయంలో భారత్ అనుసరిస్తున్న విధానాలపై ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) భారత ప్రధాని నరేంద్ర మోడీని ప్రశంసించింది.
 
2. బ్రెజిల్ అధ్యక్షుడు ప్రధాని నరేంద్ర మోదీని సంక్షోభంలో సహాయం కోసం హనుమాన్‌జీగా పోల్చారు.
 
3. అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు ట్రంప్ స్వయంగా ఫోన్ చేసి తమకు సాయం కావాలంటూ మాత్రల కోసం అభ్యర్థన చేశారు.
 
4. ప్రపంచంలో రెండవ అతిపెద్ద జనాభా కలిగిన భారత్, కోవిడ్ 19ని సమర్థవంతంగా ఎదుర్కొంటుందనేది ప్రపంచంలో చాలా దేశాల మాట.
Modi Leading The World
హనుమాన్ సంజీవిని అని...
కరోనా వైరస్ ప్రపంచాన్ని కబళిస్తున్న వేళ... ప్రపంచ దేశాలకు భారత్ పెద్దదిక్కుగా మారింది. ఈ కరోనా వైరస్ సోకిన వారికి కొంతమేరకు ఉపశమనం కలిగించే మందు భారత్ వద్ద పుష్కలంగా ఉండటంతో అన్ని దేశాల అధినేతలు భారత్‌ను ఆశ్రయిస్తున్నాయి. ఈ దేశాల్లో చివరకు ప్రపంచ అగ్రరాజ్యం అమెరికా కూడా ఆ మందు కోసం భారత్‌ను ఆశ్రయించింది. 
 
ఈ పరిస్థితుల్లో తాజాగా బ్రెజిల్ కూడా భారత ప్రధాని నరేంద్ర మోడీని సంప్రదించారు. కరోనా రోగుల చికిత్స కోసం ఉపయోగించే హైడ్రాక్సీక్లోరోక్వీన్ కావాలంటూ బ్రెజిల్ అధ్యక్షుడు జెయిర్ బొల్సనారో హనుమజయంతి రోజున ఓ లేఖ రాశారు. 
 
ఈ లేఖలో రామాయ‌ణ ప్ర‌స్తావ‌న తెచ్చారు. ల‌క్ష్మ‌ణుడిని కాపాడేందుకు హిమాల‌యాల నుంచి హ‌నుమంతుడు సంజీవిని తీసుకువ‌చ్చార‌న్నార‌న్నారు. అలాగే పేద‌ల‌ను కాపాడేందుకు జీసెస్ కూడా ఎన్నో మ‌హిమ‌లు ప్ర‌ద‌ర్శించి రోగాల‌ను పార‌ద్రోలార‌ని, ఆ రీతిలోనే మాకు హైడ్రాక్సీక్లోరోక్వీన్ మాత్ర‌ల‌ను ఇచ్చి మ‌మ్ముల్ని కాపాడాలంటూ బ్రెజిల్ అధ్య‌క్షుడు బొల్స‌నారో బుధవారం మోడీకి లేఖ రాశారు. 
Modi Leading The World
ఈ సందర్భంగా బ్రెజిల్‌కు పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని ప్రధాని నరేంద్ర మోడీ భరోసా ఇచ్చినట్టు తెలుస్తోంది. మొత్తంమీద మందులేని కరోనా వైరస్‌కు ప్రస్తుతం భారత్ వద్ద ఉన్న హైడ్రాక్లీక్లోరోక్వీన్ ఓ దివ్యౌషధంగా మారింది. ఈ పరిణామాలన్నిటి నేపధ్యంలో #ModiLeadingTheWorld అంటూ సోషల్ నెట్వర్కింగ్ సైట్లలో ట్రెండ్ నడుస్తోంది. నెటిజన్లు దీన్ని ట్యాగ్ చేస్తూ కామెంట్లు పోస్ట్ చేస్తున్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

మోడీ మిమ్మల్ని మరువం, యావత్ మానవాళికి మీ నాయకత్వం అవసరం: ట్రంప్