సోషల్ మీడియాలో మూగజీవాలకు సంబంధించిన వీడియోలు ఎన్నో వైరల్ అయిన సందర్భాలున్నాయి. తాజాగా ఓ తెలివైన కోతికి సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది. ఈ వీడియోలో ఓ వానరం చెట్టు నుంచి పడిన ఓ కాయలోని దాగివున్న నట్స్‌ను తినేందుకు తెలివిగా వ్యవహరించింది.
ఇందుకోసం ఆ కాయను పగుల కొట్టేందుకు రాయిని ఉపయోగించింది. ఆ ఎండిన కాయను రాయితో గట్టిగా కొట్టి.. అందులోని గింజను ఎంచక్కా తినేసింది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఆ కోతి బాగా తెలివైన కోతి అంటూ కామెంట్లు చేస్తున్నారు.