Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

వ్యాపారం చేసే యజమాని ఏ దిక్కున కూర్చోవాలి?

Advertiesment
Vastu tips
, మంగళవారం, 24 సెప్టెంబరు 2019 (22:12 IST)
షాపులకు వాస్తు సరిగా లేకపోతే అనేక సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. ప్రస్తుతం మనం షాపుల యొక్క యజమానుల గృహములను వాస్తు బాగుండి, బాగులేదు అను విషయమును పక్కన బెట్టి, వాస్తు పరంగా షాపు గురించి చర్చిస్తే, షాపుకు వాస్తు సరిగా లేకపోతే వ్యాపారం జరుగదు, లేదా మందకొడిగా జరుగుతుంది. 
 
అప్పులపాలు కావడం, ఇతరులకు పూచీలు పడి చేయని పాపానికి మీరు డబ్బు కట్టడం, కొట్లాటలు, అప్పు ఇచ్చిన ఆర్థిక సంస్థల నుండి నోటీసులు రావడం, కోర్టులో కేసులు వేయడం, ప్రభుత్వ సంస్థల నుండి అధికారులు తనిఖీలకు వచ్చి బాగా ఇబ్బంది పెట్టడం, జరిమానాలు వేయడం, షాపు సీజ్ కావడం, అవమానం ఇతరత్రా. అందువల్ల వాస్తు సక్రమంగా వుండేట్లు చూసుకోవాలి.
 
1. యజమాని వాయువ్యములో బల్లవేసుకొని తూర్పుకు చూస్తూ కూర్చోవాలి. మీకు అవసరమనుకుంటే ఉత్తరమునకు కూడా చూస్తూ కూర్చోవచ్చు.
 
2. దక్షిణ గోడకు మొత్తం ఆనుకొని బలమైన ఒక అరుగును నిర్మించుకోవడం మంచిది. ఈ విధానము చాలా గొప్ప ఫలితములను ఇస్తూ ఉన్నది.
 
3. దక్షిణ, పశ్చిమ గోడలకు పెద్ద ర్యాకులను తూర్పు గోడకు చిన్న ర్యాకులను ఏర్పాటు చేసుకోవచ్చు.
 
4. దేవుడిని వాయువ్యము భాగములో పశ్చిమ గోడకు ఆనుకొని చెక్క పలక వేసుకొని దీపారాధన చేసుకోవచ్చు.
 
5. స్విచ్‌బోర్డు పశ్చిమ గోడకు ఆనుకొని వాయువ్య భాగములో వేసుకోవాలి.
 
6. మీరు కూర్చున్న ప్రక్కనే దక్షిణము వైపుగా పశ్చిమ గోడను ఆనుకొని బీరువాను ఏర్పాటు చేసుకోవాలి. ఈ బీరువా ఉత్తరమును చూసినచో మంచి ఫలితములను ఇచ్చును. తూర్పు చూచిన ఏ దోషమూ లేదు.
 
7. షాపు బయట ఉత్తర ఈశాన్యము కోల్పోకుండా కనీసం రెండు అడుగుల అరుగును వేసుకొని, అరుగు పక్కగా మెట్లను వేసుకోవాలి. అయితే షాపు యందలి ఫ్లోరింగ్ కన్నా బయటి అరుగు ఫ్లోరింగ్ పల్లముగా ఉండాలి.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

తల మీద కాకి రెట్ట వేస్తే ఏం జరుగుతుంది?