దొండకాయతో బిర్యాని తయారీనా? ఎలా?
దొండకాయలోని విటమిన్ బి నాడీవ్యవస్థకు ఎంతో మేలు చేస్తుంది. ఆందోళన, మూర్ఛ వ్యాధులతో బాధపడేవాళ్లకి దొండకాయ మంచి ఔషధంగా పనిచేస్తుంది. ఇందులోని రిబోఫ్లేవిన్ ఎక్కువగా ఉంటుంది కనుక దొండ మనస్సును ప్రశాంతంగా ఉంచి, డిప్రెషన్ తగ్గడానికి దోహదపడుతుంది. మరి ఇటు
Publish Date: Tue, 10 Jul 2018 (12:57 IST)
Updated Date: Tue, 10 Jul 2018 (14:31 IST)
దొండకాయలోని విటమిన్ బి నాడీవ్యవస్థకు ఎంతో మేలు చేస్తుంది. ఆందోళన, మూర్ఛ వ్యాధులతో బాధపడేవాళ్లకి దొండకాయ మంచి ఔషధంగా పనిచేస్తుంది. ఇందులోని రిబోఫ్లేవిన్ ఎక్కువగా ఉంటుంది కనుక దొండ మనస్సును ప్రశాంతంగా ఉంచి, డిప్రెషన్ తగ్గడానికి దోహదపడుతుంది. మరి ఇటువంటి దొండకాయతో బిర్యాని ఎలా తయారుచేయాలో చూద్దాం.
కావలసిన పదార్థాలు:
బాస్మతి బియ్యం - 2 కప్పులు
ఉల్లిపాయ - 1
నూనె - స్పూన్స్
నెయ్యి - 1/2 స్పూన్స్
అల్లం వెల్లుల్లి పేస్ట్ - 1 స్పూన్
కొబ్బరి పేస్ట్ - 2 స్పూన్స్
దనియాలుపొడి - 1 స్పూన్
జీరాపొడి - 1/2 స్పూన్
కారం - 1 స్పూన్
పసుపు - 1/2 స్పూన్
దొండకాయలు - పావుకేజీ
ఉప్పు - సరిపడా
నిమ్మరసం - 1 స్పూన్
కొత్తిమీర - 1 కప్పు
పచ్చిమిర్చి - 2
తయారీ విధానం:
ముందుగా బియ్యం పొడిగా ఉడికించి పక్కనపెట్టుకోవాలి. బాణలిలో కొద్దిగా నూనె, నెయ్యి వేసి నిలువుగా తరిగిన దొండకాయల్ని 15 నిమిషాలు వేగించి తీసేయాలి. అదే నూనెలో ఉల్లి, అల్లం వెల్లుల్లి, పుదీనా వేగించి కొబ్బరి పేస్ట్ కలుపుకోవాలి. 2 నిమిషాల తరువాత ధనియాలు పొడి, జీరాపొడి, పసుపు, ఉప్పు, కారం కలిపి దొండకాయ ముక్కలు వేసి 7 నిమిషాలు వేగాక ఆ మిశ్రమంలో అన్నం, నిమ్మరసం కలుపుకుని దించేయాలి. అంతే దొండకాయ బిర్యాని రెడీ.
About Writer
Kowsalya
దేవీ (మురళీకృష్ణ)
నిక్‌నేమ్- శక్తిమాన్
సినిమా రంగంలో దాదాపు 26 ఏళ్ల అనుభవం ఉంది. కళారంగంపై ఇంట్రెస్టుతో రిపోర్టర్‌గా కెరీర్ మొదలైంది. అలా చేస్తూనే విజయవాడలో రంగస్థలంపై నాటకాల్లో పాత్రలు పోషించారు. అలా ఆర్టిస్టుగా.. పలు సినిమాలు, సీరియల్స్‌లో సైతం నటించారు. స్క్రిప్ట్ వర్క్‌లో కూడా కొద్దికాలం చేశారు. అలా ప్రజాశక్తి దినపత్రికలో సినిమా పేజీ న్యూస్ రిపోర్టర్‌గా తనతోనే ఆరంభం అయింది. అలా చేస్తుండగానే మెగాస్టార్ చిరంజీవి గారితో ఇంటర్వ్యూ చేశాక......
Read More