గసగసాలతో పాయసమే కాదు.. పులావ్ కూడా చేయోచ్చు.. ఎలా..?
గసగసాలు ఎక్కువగా కూరలలో మసాలా కోసం వాడుతుంటారు. ఇది వేయడం వలన ఆ కూరకు కమ్మని రుచి వస్తుంది. మాంసాహారంలో మసాలా కోసం దీనిని అధికంగా వేస్తారు. కొంతమందైతే గసగసాలలో పాయసం కూడా చేస్తారు. కానీ ఇవి పిల్లలకు అ
Publish Date: Wed, 26 Sep 2018 (13:16 IST)
Updated Date: Wed, 26 Sep 2018 (13:36 IST)
గసగసాలు ఎక్కువగా కూరలలో మసాలా కోసం వాడుతుంటారు. ఇది వేయడం వలన ఆ కూరకు కమ్మని రుచి వస్తుంది. మాంసాహారంలో మసాలా కోసం దీనిని అధికంగా వేస్తారు. కొంతమందైతే గసగసాలలో పాయసం కూడా చేస్తారు. కానీ ఇవి పిల్లలకు అంతగా నచ్చవు. కనుక వీటిలో పులావ్ చేసిత్తే తప్పకుండా తింటారు. మరి గసగసాల పులావ్‌కు కావలసిన పదార్థాలు, ఎలా తయారుచేయాలో తెలుసుకుందాం.
కావలసిన పదార్థాలు:
గసగసాల మిశ్రమం - అర కప్పు
కొబ్బరి పాలు - 3 కప్పులు
బియ్యం - 1 కప్పు
క్యారెట్ ముక్కలు - అర కప్పు
ఉల్లిపాయ - 1
పచ్చిమిర్చి - 3
అల్లంవెల్లుల్లి పేస్ట్ - 1 స్పూన్
టమాటా ముక్కలు - 1 కప్పు
నెయ్యి - 25 గ్రాములు
కొత్తిమీర తరుగు - కొద్దిగా
లవంగాలు - 5
యాలకులు - 3
దాల్చిన చెక్క - చిన్నది
ఉప్పు - తగినంత
తయారీ విధానం:
ముందుగా బాణలిలో నూనెను పోసి వేడయ్యాక అందులో మసాలాదినుసులు, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చిని బాగా వేయించుకోవాలి. ఆ తరువాత క్యారెట్ ముక్కలు, టమోటా ముక్కలు, అల్లంవెల్లుల్లి పేస్ట్, గసగసాల పేస్ట్, మిగిలిన పదార్థాలన్నింటిని వేసి వేయించుకోవాలి. చివరగా కొబ్బరిపాలు పోసి మరిగిన తరువాత నానబెట్టిన బియ్యం, ఉప్పు వేసి ఉడికించుకుని కొత్తిమీర చల్లుకోవాలి. అంతే... ఘుమఘుమలాడే గసగసాల పులావ్ రెడీ.
About Writer
Kowsalya
దేవీ (మురళీకృష్ణ)
నిక్‌నేమ్- శక్తిమాన్
సినిమా రంగంలో దాదాపు 26 ఏళ్ల అనుభవం ఉంది. కళారంగంపై ఇంట్రెస్టుతో రిపోర్టర్‌గా కెరీర్ మొదలైంది. అలా చేస్తూనే విజయవాడలో రంగస్థలంపై నాటకాల్లో పాత్రలు పోషించారు. అలా ఆర్టిస్టుగా.. పలు సినిమాలు, సీరియల్స్‌లో సైతం నటించారు. స్క్రిప్ట్ వర్క్‌లో కూడా కొద్దికాలం చేశారు. అలా ప్రజాశక్తి దినపత్రికలో సినిమా పేజీ న్యూస్ రిపోర్టర్‌గా తనతోనే ఆరంభం అయింది. అలా చేస్తుండగానే మెగాస్టార్ చిరంజీవి గారితో ఇంటర్వ్యూ చేశాక......
Read More