వెజిటబుల్ ఇడ్లీ ఎలా చేయాలో తెలుసా?
వెజిటబుల్ ఇడ్లీ కావలసిన పదార్థాలు: ఇడ్లీ పిండి - 4 కప్పులు జీడిపప్పు - కొద్దిగా వంటసోడా - కొద్దిగా నూనె - తగినంత క్యారెట్ - 1 క్యాబేజీ తురుము - పావుకప్పు బీన్స్ తురుము - పావుకప్పు కాప్సికమ్ - 1 పచ్చిబఠాణీలు - పావుకప్
Publish Date: Thu, 30 Aug 2018 (14:55 IST)
Updated Date: Thu, 30 Aug 2018 (15:36 IST)
కావలసిన పదార్థాలు:
ఇడ్లీ పిండి - 4 కప్పులు
జీడిపప్పు - కొద్దిగా
వంటసోడా - కొద్దిగా
నూనె - తగినంత
క్యారెట్ - 1
క్యాబేజీ తురుము - పావుకప్పు
బీన్స్ తురుము - పావుకప్పు
కాప్సికమ్ - 1
పచ్చిబఠాణీలు - పావుకప్పు
కొబ్బరిపొడి - 1 స్పూన్
ఉల్లిపాయ - 1
ధనియాల పొడి - 1 స్పూన్
కరివేపాకు - కొద్దిగా
ఆవాలు, జీలకర్ర - 1/2 స్పూన్
ఉప్పు - తగినంత
పచ్చిమిర్చి పేస్ట్ - 1 స్పూన్
తయారీ విధానం:
ముందుగా బాణలిలో నూనెను వేసి వేడయ్యాక అందులో జీడిపప్పు వేయించుకుని పక్కన పెట్టుకోవాలి. అదే నూనెలో ఆవాలు, జీలకర్ర, కూరగాయల ముక్కలు వేసుకుని కాసేపటి వరకు వేయించుకోవాలి. ఆ తరువాత ఆ మిశ్రమంలో ఉప్పు, పచ్చిమిర్చి పేస్ట్ వంటసోడా, ధనియాల పొడి, కొబ్బరిపొడి వేసుకుని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని ఇడ్లీపిండిలో కలుపుకుని ఇడ్లీ పాన్‌లో ఇడ్లీల్లా వేసుకుని వాటిపై జీడిపప్పు చల్లుకుని ఆవిరి మీద ఉడికించుకోవాలి. అంతే... వెజిటబుల్ ఇడ్లీ రెడీ.
About Writer
Kowsalya
దేవీ (మురళీకృష్ణ)
నిక్‌నేమ్- శక్తిమాన్
సినిమా రంగంలో దాదాపు 26 ఏళ్ల అనుభవం ఉంది. కళారంగంపై ఇంట్రెస్టుతో రిపోర్టర్‌గా కెరీర్ మొదలైంది. అలా చేస్తూనే విజయవాడలో రంగస్థలంపై నాటకాల్లో పాత్రలు పోషించారు. అలా ఆర్టిస్టుగా.. పలు సినిమాలు, సీరియల్స్‌లో సైతం నటించారు. స్క్రిప్ట్ వర్క్‌లో కూడా కొద్దికాలం చేశారు. అలా ప్రజాశక్తి దినపత్రికలో సినిమా పేజీ న్యూస్ రిపోర్టర్‌గా తనతోనే ఆరంభం అయింది. అలా చేస్తుండగానే మెగాస్టార్ చిరంజీవి గారితో ఇంటర్వ్యూ చేశాక......
Read More