కంటి మంటలకు కలబంద గుజ్జుతో మర్దన చేసుకుంటే?
నేటి ఉరుకుల పరుగుల జీవితంలో చాలామంది అనేక అనారోగ్య సమస్యల బారిన పడుతున్నారు. వాటిల్లో కంటి సమస్యలు ప్రధానమైనవి. ఆఫీసుకు వెళితే ల్యాప్‌టాప్‌లు, స్మార్ట్ఫోన్లు, ట్యాబ్‌లు వీటితోనే పనిచేస్తుంటారు. దీంతో
Publish Date: Thu, 26 Jul 2018 (16:05 IST)
Updated Date: Thu, 26 Jul 2018 (16:57 IST)
నేటి ఉరుకుల పరుగుల జీవితంలో చాలామంది అనేక అనారోగ్య సమస్యల బారిన పడుతున్నారు. వాటిల్లో కంటి సమస్యలు ప్రధానమైనవి. ఆఫీసుకు వెళితే ల్యాప్‌టాప్‌లు, స్మార్ట్ఫోన్లు, ట్యాబ్‌లు వీటితోనే పనిచేస్తుంటారు. దీంతో నేత్ర సంబంధ సమస్యల బారిన పడేవారు పెరుగుతున్నారు. కొందరికి దృష్టి సరిగ్గా కనిపించక పోవడం వలన అద్దాలు, లెన్స్‌లు పెట్టుకోవలసిన పరిస్థితి ఏర్పడుతుంది.
మరికొందరికి కళ్లు మంటలు, దురదలు, కంటి నుండి నీరు కారడం వంటి సమస్యలతో బాధపడుతుంటారు. ఇలాంటి సమస్యల నుండి విముక్తి చెందుటకు ఈ చిట్కాలు పాటిస్తే మంచి ఫలితాలను పొందవచ్చును. ఒక పరిశుభ్రమైన వస్త్రాన్ని తీసుకుని గోరువెచ్చని నీళ్లలో ముంచి ఆ వస్త్రాన్ని కళ్ల మీద 5 నిమిషాల పాటు ఉంచుకోవాలి. ఆ తరువాత కళ్లపై మెత్తగా ఒత్తాలి. ఇలా చేయడం వలన కళ్లలో పడిన దుమ్ము, ధూళి తొలగిపోతుంది.
కళ్లలో తిరిగి నీరు ఉత్పత్తి పెరుగుతుంది. తద్వారా కళ్లు పొడిబారడం తగ్గి దురదలు, మంటలు తగ్గుతాయి. కలబంద ఆకుని బాగా కడిగి దానిని కట్‌చేసి మధ్యలోనుండి గుజ్జును బయటకు తీసుకోవాలి. ఆ గుజ్జును కనురెప్పలపై రాసుకుని కళ్లు మూసుకుని 10 నిమిషాల పాటు అలానే ఉండాలి. ఆ తరువాత గోరువెచ్చని నీటితో కడిగేసుకోవాలి.
రోజుకు ఇలా రెండుసార్లు చేయడం వలన కంటి మంటలు తగ్గిపోతాయి. రోజ్‌వాటర్‌లో విటమిన్ ఎ పుష్కలంగా ఉంటుంది. విటమిన్ ఎ సరిగ్గా అందకపోయినా కూడా కళ్లు పొడిబారుతాయి. అందువలన రోజ్‌వాటర్‌లో దూదిని ముంచి కళ్లు మూసుకుని రెప్పలపై ఆ దూదిని ఉంచాలి. 10 నిమిషాల తరువాత చల్లని నీటితో కడిగేసుకోవాలి. ఇలా చేయడం వలన కంటి దురదలు, మంటలు నుండి ఉపశమనం పొందవచ్చును.
Kowsalya
Publish Date: Thu, 26 Jul 2018 (16:05 IST)
Updated Date: Thu, 26 Jul 2018 (16:57 IST)