Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

మూస ధోరణి కి తిరస్కారం, పురాణ కల్పితాలకు పెద్దపీట - 2024 సినీరంగం రౌండప్

Advertiesment
Hit cinemalu

డీవీ

, మంగళవారం, 24 డిశెంబరు 2024 (14:04 IST)
Hit cinemalu
చిత్రసీమది చిత్రమైన పరిస్థితి. ప్రతి ఏడాది సక్సెస్ రేట్ కంటే ప్లాప్స్ శాతమే అధికం. ఈసారి కూడా అదే ఒరవడి కొనసాగింది. అగ్ర హీరోల సినిమాలకు థియేటర్లు ఎక్కువ, చిన్న సినిమాలకు థియేటర్లు లేకపోవడం కూడా ఈ ఏడాది చవిచూసింది.  కొత్తగా కథలతో కొత్త కథనాలతో యువ హీరోలు, యువ దర్శకులు ఈ ఏడాది ఎక్కువగా వచ్చిన సినిమాలు విడుదలయ్యాయి. 2024లో జనవరి ఆరంభంలోనే సింగర్ సునీత్ కుమారుడు ఆకాశ్ నటించిన సర్కారు నౌకరి, వెంకటేష్  సైంధవ్ లు ఏమంత ఫలితాన్ని ఇవ్వలేకపోయాయి.
 
2024లో జనవరి సంక్రాంతికి వస్తున్నట్లు దర్శక నిర్మాతలు హనుమాన్ విడుదలచేస్తున్నట్లు ముందుగానే ప్రకటించారు. అయితే సంక్రాంతి రెండురోజులవరకు వారికి సరైన థియేటర్లు లభించలేదు. ఉన్నా కొద్ది థియేటర్లతో సరిపెట్టుకోవాల్సివచ్చింది. దిల్ రాజు వంటి అగ్ర నిర్మాత, పంపిణీదారుడు, ఎగ్జిబిటర్ ఆధ్వర్యంలో మహేష్ బాబు గుంటూరు కారం భారీ థియేటర్లలో విడుదలైంది. అయితే తివిక్రమ్ శ్రీనివాస్ తీసిన గత చిత్ర ఛాయలు వుండడంతో అనుకున్న సక్సెస్ సాధించలేదనే ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. కానీ నిర్మాత నాగవంశీ మాత్రం మాది సేప్ ప్రాజెక్ట్ అంటూ తెలిపారు. అయితే బాలనటుడు తేజ సజ్జా చేసిన హనుమాన్ చిత్రానికి ప్రేక్షకులు బ్రహ్మరథంపట్టారు. భిన్నమైన కథ, పురాణాల నేపథ్యానికి సింక్ చేస్తూ తీయడంతో కొత్తగా అనిపించింది. ఇక అదే సమయంలో నాగార్జున తన సత్తాను చాటుకునేందకు నా సామిరంగా చిత్రంతో వచ్చారు. బ్లాక్ బస్టర్ కాలేదుకానీ ఏవరేజ్ సినిమాగా నిలిచింది. 
 
webdunia
Average not hits
ఆ తర్వాత ఫిబ్రవరిలో సందీప్ కిషన్ సక్సెస్ కోసం ఎదురుచూస్తూ ఊరు పేరు భైరవ కోన ఫిబ్రవరి 16న విడుదలైంది. ఊరిలో దెయ్యాలున్నాయనే సరికొత్త కాన్సెప్ట్ తో రావడంతో ఈ సినిమా ఆ హీరోకు విజయం తెచ్చిపెట్టింది. ఆ తర్వాత నెలలో విడుదలైన వరుణ్ తేజ్  ఆపరేషన్ వాలేంటైన్ మిలట్రీ నేపథ్యం, టెర్రరిజం కావడంతో ప్రేక్షకులు తేలిగ్గా తీసుకున్నారు. ఇక అదే టైంలో విశ్వక్ సేన్ సరికొత్త ఒరవడిలో గత జన్మకాల నేపథ్యంలో చేసిన గామి సినిమా ఊహించని విజయాన్ని తెచ్చిపెట్టింది. ఇక యూత్ ను టార్గెట్ చేస్తూ క్యారెక్టర్ లో కాస్త కేర్ లెస్ నెస్, కాస్త అమయాకత్వంగా కనిపించే సిద్దు జొన్నలగడ్డ టిల్లు స్క్వేర్ తో వచ్చి వందకోట్ల క్లబ్ కు చేరుకున్నాడు.  అలా మరో ముగ్గురు హీరోలు కలిసి చేసిన ఓం భూమ్ బుష్ చిత్రం వారి స్థాయికి తగిన సక్సెస్ తెచ్చిపెట్టింది. ఊరిలో వున్న దెయ్యాన్ని పెండ్లిచేసుకునే క్యారెక్టర్ లో సరికొత్త కథాంశంగా శ్రీ విష్ణు మార్కులు కొట్టేశాడు.
 
ఇక ఆ తర్వాత విజయ్ దేవరకొండ, మ్రుణాలిఠాగూర్ కలిసి నటించిన ఫ్యామిలీ స్టార్ ప్రమోషన్ లో బాగా హిట్ అయింది. కానీ రిలీజ్ తర్వాత అంత సీన్ లేదని ప్రేక్షకులు తీర్పు చెప్పారు.అల్లరి నరేశ్ తన అల్లరిని మార్చాలని మాస్ సినిమాల స్థాయికి ఎదగాలని చేసిన ప్రయత్నాలు బెడికికొట్టడంతో మరలా పాత ఫార్మెట్ లోనే  ఆ ఒక్కటీ అడక్కు తీసి పర్వాలేదు అనిపించాడు. సీక్వెల్ బాటలో గీతాంజలి మళ్ళీ వచ్చింది అంటూ కమేడియన్ శ్రీనివాస్ రెడ్డి చేసిన ప్రయత్నం బెడిసికొంట్టింది. 
 
నారా రోహిత్ చేసిన ప్రతినిధి 2, సుధీర్ బాబు చేసిన హరోం హర సినిమాలు ఏమంతగా ఆదరణకు నోచుకోలేకపోయాయి. భజే వాయు వేగం, గమ్ గమ్ గణేశా అంటూ ఆనంద్ దేవరకొండ వచ్చినా గణపతి ఆశీస్సులు ఇవ్వలేకపోయాడు. మరో హిట్ కొట్టాలని మాస్ సినిమాగా గ్యాంగ్ ఆఫ్ గోదావరితో వచ్చిన విశ్వక్ సేన్ అనుకున్నది సాధించలేకపోయారు. 

పసలేని కథా చిత్రాలు
 
ఇక పాన్ ఇండియా సినిమాలుగా అగ్ర హీరోలుచేసే క్రమంలో విడుదలకు టైం పట్టడంతో చిన్న సినిమాలు థియేటర్లకు వచ్చాయి.  శివకందుకూరి, నందిత శ్వేత జంటగా రాఘవరెడ్డి, హ్యాపీ ఎండింగ్, బిఫోర్ మేరేజ్, రామ్, కిస్మత్, గేమ్ ఆన్, ధీర, అంబాజీ మేరేజ్ బ్యాండ్, ఐ హేట్ యు, యాత్ర 2, ఈగెల్, రాజధాని ఫైల్స్, సుందరం మాస్టర్, ప్రవీణ్ ఐపిఎస్, సిద్దార్థ రాయ్, 14డేస్ లవ్, ప్రేమలో ఇద్దరు, ఇంటినెంబర్ 13, రాధామాధవన్, లంబసింగి, రజాకార్, మాయ, తంత్ర, లైన్ మాన్, కళింగపట్నం, తలకోన, టెనెంట్, రుద్రాక్ష పురం, మల్లెమొగ్గ, కొంచె హట్కే, ఆరంభం, రక్షణ, ప్రేమించి చూడు అంటూ పలు చిత్రాలు వచ్చాయి. వాటిని ఎవరూ ప్రేమించే సాహసం చేయలేకపోయారు. అదే బాటలో  నవీన్ చంద్ర, కాజల్ నటించిన సత్యభామ, ఇంద్రాణి, హనీమూస్ ఎక్స్ప్రెస్, వెన్నెల కిశోర్ ఓ.ఎం.జి.చిత్రాలు ఏమీ ఫలితాన్ని చూపించలేకపోయాయి. అయితే మధ్యవయస్సులో లీడ్ రోల్ గా చేసిన మ్యూజిక్ షాప్ మూర్తి చిత్రం అజయ్ ఘోష్ కు ప్రయోగాత్మక సినిమాగా పేరు తెచ్చిపెట్టింది.
 
ఇలా స్తబ్ధతగా వుంటూ థియేటర్లకు జనాలు రాకపోవడంతో ఒక్కసారిగా థియేటర్లను నింపేదుకే వచ్చినట్లు జూన్ లో కల్కి 1898 ఎ.డి. విడుదలై ధియేటర్లకు కళను తెచ్చిపెట్టాయి. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో చేసిన ఈ సినిమా పాన్ వరల్డ్ గా మంచి పేరు తెచ్చిపెట్టింది. ఇక ఆ తర్వాత నీహారిక కొణిదెల సమర్పణలో వచ్చిన కమిటీ కుర్రాళ్ళు కాస్త ఊరటనిచ్చింది. రామ్ పోతినేని సీక్వెల్ గా చేసిన డబుల్ ఇస్మార్ట్ శంకర్ డిజాస్టర్ గా నిలిచింది. ఆ తర్వాత కొత్తవారితో చేసిన ఆయ్, రావురమేష్ ప్రధాన పాత్రలో చేసిన మారుతీనగర్ సుబ్రహ్మణ్యం సినిమాలు ఓటీటీకి వెళ్ళేందుకు థియేటర్లలో మార్గాన్ని చూపాయి. నారి సరిపోదా శనివారం అంటూ వచ్చి పర్వాలేదు అనిపించాడు. అదే టైంలో వచ్చిన ఎన్.టి.ఆర్. దేవర-1 అంటూ వచ్చి మంచి హిట్ కొట్టాడు. రాజమౌళి సినిమా ఆర్.ఆర్.ఆర్. తర్వాత సెకండ్ సినిమా ఫెయిల్ అనే నానుడికి బ్రేక్ చేశాడు.
 
ఆ తర్వాత హిట్ కోసం ఎప్పటినుంచో ఎదురుచూస్తున్న గోపీచంద్ కు విశ్వం లాబించలేదు. స్వాగ్ కూడా పెద్దగా ఆడలేదు. శ్రీవిష్ణు ఐదు పాత్రలు పోషించడం మైనస్ గా మారింది. ఇలాంటి టైంలో సైలెంట్ గా మలయాళ నటుడు తెలుగు సినిమాచేసి లక్కీ భాస్కర్ తో తన లక్క్ ను సాధించుకున్నాడు. సుహాస్ జనక అయితే గనక ఓటీటీ దారి తీసింది. వరుణ్ తేజ్ 1980కాలంనాటి వైజాగ్ నేపథ్యంలో తీసిన మట్కా బెడిసికొట్టింది. అదే టైంలో వచ్చిన విశ్వక్ సేన్ మెకానిక్ రాకీ కూడా అంతగా సక్సెస్ కాలేకపోయింది. ఇక ఆ తర్వాత వచ్చి అల్లు అర్జున్ నటించిన పుష్ప 2 సినిమా క్రమేణా వందలకోట్ల నుంచి వెయ్యి కోట్ల గ్రాస్ వరకు కలెక్లన్లు తెచ్చేలా చేయడం ఈ ఏడాది విశేషం. ఇక ఆ సినిమా తర్వాత వచ్చిన పలు సినిమాలు ఏమాత్రం ఆశించిన స్థాయిలో ఆడలేకపోయాయి. ఇక ఏడాది ముగింపునాడు కొత్తహీరోగా రాబోతున్న డ్రింకర్ సాయితో ఏడాదికి ముగింపు పలకనుంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఏఐ చాట్‌బాట్‌లు, ఆటోమేషన్‌ను ఉపయోగించనున్న టీటీడీ.. ఎలాగంటే..? (video)