Tarot

Daily Horoscope

Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

టారెట్ భవిష్య దృష్టి

మొదటి కార్డును ఎంచుకోండి


టారట్ కార్డుల ప్రపంచం ఒక అంతుచిక్కని మరియు రహస్యమైన సమాచారం కలిగి ఉంటుందని అనుకోవచ్చు. ఎందుకంటే భవిష్యత్తును తెలియజేసే ప్రముఖమైనవిగా చెప్పబడి ఉండటమే. మైనర్ అర్కానాకు చెందిన ఈ కార్డులకు సంబంధించిన పదం టరోచ్చి అనే దాన్నుంచి వచ్చినట్లు కొంతమంది అనుకుంటూ ఉంటారు. మరికొందరైతే దీని మూలాధారం టారొట్టి అని చెపుతుంటారు. ఎందుకంటే కార్డు వెనుక భాగంలో క్రాస్ లైన్లు కనబడుతూ ఉంటాయి. టారెట్ అనేది అంతుచిక్కని, రహస్యమైనవని చెపుతున్నప్పటికీ ఇవి సమీప భవిష్యత్తును తెలుపుతాయని విశ్వాసం.

టెరాటో డెక్ అనేది 78 కార్డులను కలిగి ఉంటుంది. అన్నీ మేజర్ మరియు మైనర్ అర్కానాలుగా విభజించబడి ఉంటాయి. అర్కానా అనేది లాటిన్ పదం. అర్కానా అంటే అంతుచిక్కని వ్యక్తిగత పరిణామాలు. కనుక అర్కానా అనేది రహస్యాలకు చిహ్నాలుగా చెప్పబడ్డాయి. ప్రధాన అర్కానా అనేది విద్యార్థులకు రహస్య శాస్త్రానికి సంబంధించి ఓ గొప్ప సబ్జెక్టుగా ఉంటుంది.

టారెట్ అనేవి వివిధ మతాల సమూహాల మరియు కులాలకు టీచింగ్ సింబల్స్. టారట్ యొక్క ఫిలాసఫికి కబ్బాలాకు మూలాధారం. పదాలు, సంఖ్యలతో కూడుకుని అద్వితీయమైన శక్తులను కలిగి ఉంటాయి. భవిష్యత్తును తెలియజేసే ప్రముఖమైనవిగా టారెట్‌ను చెపుతారు. కనుక, భవిష్యత్తుకు సంబంధించిన రహస్యాలను అర్థం చేసుకునేందుకు ప్రయత్నించండి.

టారెట్ భవిష్య దృష్టిని చేయడమెలా

  • మొదటగా, మీ మనసులో ఏమనుకుంటున్నారో ఆ ప్రశ్నను తిరిగి రిపీట్ చేయండి. ఇంకా స్పష్టత కోసం, దాన్ని ఓ పేపరుపైన రాసుకోండి.
  • వరుసగా ఒకటి తర్వాత ఒకటి మూడుసార్లు 'మీ కార్డును ఎంచుకోండి' పైన క్లిక్ చేయండి. అంతే, మీరు మూడు విభిన్న కార్డులను ఎంచుకున్నట్లయింది.
  • మొదటి కార్డు, మీరు ప్రశ్న అడిగేటపుడు మీ మానసిక స్థితి ఏమిటో తెలియజెపుతుంది.
  • రెండో కార్డు, మీ కోర్కెలను నెరవేర్చుకునేందుకు మీరు పడుతున్న శ్రమను తెలియజేస్తుంది.
  • మూడవ మరియు తుది కార్డు మీ ప్రశ్నలకు సమాధానాలను ఇస్తుంది.