Publish Date: Wed, 28 Oct 2020 (08:16 IST)
Updated Date: Wed, 28 Oct 2020 (08:18 IST)
విశాఖపట్నంనకు చెందిన దాత గౌతమ్ నంద విజయ భార్గవ్ శ్రీ కనకదుర్గ అమ్మవారికి కానుకగా సుమారు 4,126 గ్రాముల బరువు గల 9 వెండి బిస్కేట్లను సమర్పించారు.
ఆలయ కార్యనిర్వహణాధికారి ఎం.వి.సురేష్ బాబుని కలిసి అందించారు. ఆలయ అధికారులు దాత కుటుంబమునకు అమ్మవారి దర్శనము కల్పించి, అమ్మవారి శేషవస్త్రము, చిత్రపటం, మరియు ప్రసాదములు అందజేశారు.