ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఆటో డ్రైవర్లకు శుభవార్త చెప్పింది. వాపాప మిత్ర కింద రూ.15 వేలు ఆర్థిక సాయం చేయనునట్టు వెల్లడించింది. ఈ పథకాన్ని దసరా కానుకగా అమలు చేస్తామని ప్రభుత్వం వెల్లడించింది. అక్టోబరు 1వ తేదీన పంపిణీ చేయనున్న వాపాప మిత్ర సాయానికి సంబంధించిన మార్గదర్శకాలను ప్రభుత్వం విడుదల చేసింది.
ఈ పథకం కింద అర్హులైన రూ.15 వేల ఆర్థిక సహాయం అందజేయనుంది. ఈ సహాయాన్ని డ్రైవర్లు బీమా, ఫిట్నెస్ సర్టిఫికెట్, వాపాప మరమ్మతులు, ఇతర అవసరాల కోసం ఉపయోగించుకోవచ్చు. సొంత వాహనాన్ని పడిపే డ్రైవర్లకు మాత్రమే ఈ సహాయం అందుతుంది.
అర్హత ప్రమాణాలు :
దరఖాస్తుదారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రిజిస్టర్ అయిన వాహనం కలిగి ఉండాలి. చెల్లుబాటు అయ్యే డ్రైవింగ్ లైసెన్సు ఉండాలి.
మోటార్ క్యాబ్, డ్యూక్స్ క్యాబ్ యజమానులు ఫిట్నెస్ సర్టిఫికెట్ కలిగి ఉండాలి. ఆటో రిక్షా యజమానులకు తాత్కాలికంగా మినహాయింపు ఉంది, నీ నెలలోపు ఫిట్ నెస్ సర్టిఫికెట్ పొందాల్సి ఉంటుంది.
దరఖాస్తుదారులు పేదరిక రేఖకు దిగువన ఉండాలి లేదా బీపీఎల్ రేషన్ కార్డు కలిగి ఉండాలి. దరఖాస్తుదారు లేదా కుటుంబ సభ్యులు ప్రభుత్వ ఉద్యోగులు లేదా పెన్షనర్లు అయితే అనర్హులు. పారిశుద్ధ్య మినహాయింపు వర్తిస్తుంది.
నెలవారీ విద్యుత్ వినియోగం 300 యూనిట్లకు మించకూడదు. గత 12 నెలల సగటు ఆధారంగా లెక్కిస్తారు. 5 వాహనంపై పెండింగ్ టాక్సులు లేదా ట్రాఫిక్ చలాన్లు ఉండకూడదు. వ్యవసాయ భూమి పరిమితి: మాగాణి అయితే 3 ఎకరాలు, మెట్ట అయితే 10 ఎకరాలు, లేదా రెండు కలిపి గరిష్టంగా 10 ఎకరాల లోపు ఉండాలి. పట్టణ ప్రాంతాల్లో 1,000 చదరపు అడుగుల కంటే ఎక్కువ నివాస/వాణిజ్య నిర్మాణం ఉండకూడదు.
దరఖాస్తుల స్వీకరణ:
ఈ నెల 17 మంచి దరఖాస్తుల స్వీకరణ ప్రారంభమవుతుంది. సెప్టెంబర్ 19 వరకు కొత్త దరఖాస్తులకు అవకాశం ఉంటుంది. సెప్టెంబర్ 22 నాటికి క్షేత్ర స్థాయి పరిశీలన పూర్తి చేస్తారు. సెప్టెంబర్ 24 నాటికి తుది జాబితా సిద్ధం చేయబడుతుంది.
అక్టోబర్ 1న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో ఆర్థిక సహాయాన్ని జన చేస్తారు. ఈ పథకానికి సంబంధించి గత సంవత్సరం లబ్ధిదారుల వివరాలను కూడా గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా పునఃసమీక్షించనున్నారు. దరఖాస్తు ప్రక్రియను వేగవంతం చేయడానికి జీఎస్ డబ్ల్యూఎస్ విభాగం ప్రత్యేక ఆన్‌లైన్ ఫ్లాట్‌ఫామ్‌ను ఈ నెల 17 నాటికి సిద్ధం చేస్తుంది.