Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

పల్లెకు పోదాం ఛలో ఛలో... సంక్రాంతి పండుగకు ప్రత్యేక బస్సులు

Advertiesment
apsrtc bus

ఠాగూర్

, బుధవారం, 8 జనవరి 2025 (11:42 IST)
సంక్రాంతి పండుగను పురస్కరించుకుని ఏపీఎస్ఆర్టీసీ భారీ సంఖ్యలో ప్రత్యేక బస్సులను నడిపేలా ఏర్పాట్లు చేస్తుంది. ఆ బస్సులు బుధవారం నుంచి తిరిగేలా చర్యలు తీసుకున్నారు. సొంతూళ్లకు వచ్చే వారి కోసం ఈనెల 13 వరకు 3,900 బస్సులు నడపనున్నారు. 16 నుంచి 20వ తేదీ వరకు తిరుగు ప్రయాణమయ్యే వారి కోసం 3,300 సర్వీసులు నడిపేలా అధికారులు సమాయత్తమయ్యారు.
 
అలాగే, సంక్రాంతికి వచ్చే వారికి కోసం హైదరాబాద్ నుంచి 2,153, బెంగళూరు-375, చెన్నై-42, విజయవాడ-300, విశాఖపట్నం- 250, రాజమహేంద్రవరం-230, తిరుపతి నుంచి 50, జిల్లా కేంద్రాలు, ముఖ్య పట్టణాల నుంచి మరో 500 బస్సులు నడపనున్నారు.
 
ఇప్పటికే పదో తేదీ నుంచి 12 మధ్య అన్ని రెగ్యులర్ సర్వీసుల్లో ముందస్తు రిజర్వేషన్లు పూర్తయ్యాయి. ఆయా మార్గాల్లో ప్రత్యేక బస్సులు ఏర్పాటుచేసి, ముందస్తు రిజర్వేషన్లకు అవకాశం కల్పించామని అధికారులు తెలిపారు. రద్దీకి అనుగుణంగా బస్సులు పెంచేలా ఏర్పాట్లు చేశామన్నారు.
 
ప్రత్యేక బస్సులన్నింట్లోనూ సాధారణ ఛార్జీలే తీసుకోనున్నారు. రెగ్యులర్ బస్సుల ఛార్జీలే ప్రత్యేక బస్సుల్లోనూ ఉంటాయని ఆర్టీసీ ఎండీ ద్వారకా తిరుమలరావు తెలిపారు. రాను, పోనూ ఒకేసారి టికెట్లు బుక్ చేసుకుంటే.. ఇరువైపు ఛార్జీల్లోనూ 10 శాతం రాయితీ కల్పించారు.
 
హైదరాబాద్ నగరంతో పాటు అన్ని జిల్లా కేంద్రాలు, నగరాలు, పట్టణాల్లో ప్రత్యేక బస్సుల పర్యవేక్షణకు సూపర్‌వైజర్లను నియమించారు. బస్సుల సమాచారం కోసం కాల్సెంటర్ నంబరు 149కిగానీ, 0866-2570005గానీ ఫోన్ చేసి సమాచారం పొందవచ్చని, నిరంతరం ఈ నంబర్లు పనిచేస్తాయని ఎండీ తెలిపారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

Satya Nadella : భారతదేశంలో భారీ పెట్టుబడులు.. సత్య నాదెళ్ల ప్రకటన.. ఎంతో తెలుసా?