Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

మలక్‌పేట మెట్రో స్టేషన్ వద్ద తగలబడిన బైకులు (Video)

Advertiesment
fire accident

ఠాగూర్

, శుక్రవారం, 6 డిశెంబరు 2024 (18:39 IST)
హైదరాబాద్ నగరంలోని మలక్‌పేట మెట్రో రైల్వే స్టేషన్ అగ్నిప్రమాదం సంభవించింది. ఈ మెట్రో స్టేషన్ కింద పార్కు చేసిన బైకులు తగలబడిపోయాయి. దీంతో ఆ ప్రాంతమంతా దట్టమైన పొగలు అలముకున్నాయి. ఈ అగ్నిప్రమాదంతో ప్రయాణికులు ఆందోళనకు గురయ్యారు. వెంటనే అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించగా, వారు వచ్చి మంటలను ఆర్పివేశారు. స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. ఈ అగ్నిప్రమాదం ఎలా జరిగిందన్న అంశంపై విచారణ జరుపుతున్నారు. ఇక్కడ పార్కింగ్ చేసిన బైకుల్లో ఎలక్ట్రిక్ బైకులోని బ్యాటరీ పేలి పోవడం వల్ల ప్రమాదం జరిగిందా అనే కోణంలో ఆలోచన చేస్తున్నారు. 



Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

నటుడు దిలీప్‌కు వీఐపీ దర్శనమా? తప్పుబట్టిన కేరళ హైకోర్టు