Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

అక్కకు సాయం చేసేందుకు వస్తే మరదలిని గర్భవతి చేసిన బావ

Advertiesment
Krishna
కరోనా వైరస్ కారణంగా లాక్ డౌన్‌ కొనసాగుతున్న తరుణంలో మహిళలపై అకృత్యాలు పెచ్చరిల్లిపోతున్నాయి. తాజాగా కృష్ణా జిల్లాలో ఓ దారుణం చోటుచేసుకుంది. అక్క గర్భవతి కావడంతో ఆమెకు సాయం చేసేందుకు ఆమె సోదరి అక్క ఇంటికి వెళ్ళింది. మరదలిపై కన్నేసిన బావ మాయమాటలు చెప్పి లొంగదీసుకున్నాడు. అనేకమార్లు మరదలిపై అత్యాచారం చేయడంతో ఆమె గర్భవతి అయ్యింది. దీంతో యువతి తల్లిదండ్రులు పోలీసులను ఆశ్రయించారు. 
 
వివరాల్లోకి వెళితే.. కృష్ణాజిల్లాలోని అగిరిపల్లికి చెందిన ఇజ్రాయేలు అనే వ్యక్తి కొన్నాళ్ల క్రితం విజయవాడకు చెందిన మహిళతో వివాహం జరిగింది. అయితే, భార్య గర్భవతి కావడంతో ఆమెకు తోడుగా ఉండేందుకు విజయవాడ నుంచి ఆమె చెల్లి వచ్చింది. ఇంటిపనిలో సహాయంగా ఉంటున్న మరదలిపై బావ కన్నేశాడు. మాయమాటలతో లొంగదీసుకున్నాడు. ఆ తరువాత కూడా అనేకమార్లు దారుణానికి ఒడిగట్టాడు. 
 
కొన్ని రోజుల క్రితం యువతికి కడుపునొప్పి రావడంతో తల్లిదండ్రులు ఆసుపత్రికి తీసుకెళ్లి పరీక్షలు చేయించగా, గర్భవతి అని తేలింది. జరిగిన విషయాన్ని యువతి తల్లిదండ్రులకు చెప్పడంతో, పోలీసులను ఆశ్రయించారు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసుకొని ఇజ్రాయిలును అదుపులోకి తీసుకున్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

లిండ్‌బర్గ్‌లో అగ్నిప్రమాదం.. సురక్షితంగా తప్పించుకున్న తెలుగు విద్యార్థులు