Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

గ్రామ సచివాలయాల్లో పనులు లేకుండా కూర్చునే ఉద్యోగులున్నారు, కనిపెట్టిన కూటమి ప్రభుత్వం షాకింగ్ నిర్ణయం

Advertiesment
village secretariats

ఐవీఆర్

, సోమవారం, 27 జనవరి 2025 (13:41 IST)
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో వార్డు సచివాలయాలు, గ్రామ సచివాలయాలు అంటూ పరిపాలనను ప్రజల వద్దకు చేరువ చేసేందుకు ఏర్పాటు చేసారు. కానీ కొన్ని సచివాలయాల్లో తగినంత పనులు లేకుండా ఖాళీగా కూర్చునే సిబ్బంది ఎక్కువగా వున్నట్లు కూటమి ప్రభుత్వం కనిపెట్టింది. అంతేకాదు... పనులు చేయించుకునేందుకు సచివాలయంకి వెళితే సదరు ఉద్యోగి ఫీల్డ్ వర్కుకి వెళ్లాడంటూ తప్పించుకుని తిరిగేవారు కూడా వున్నట్లు స్వయంగా ప్రజలే ఆరోపిస్తున్నారు.
 
మొత్తమ్మీద గ్రామ సచివాలయాలలో కొన్ని గతి తప్పి పని చేస్తున్నట్లు కూటమి ప్రభుత్వం పసిగట్టి గట్టి చర్యలకు దిగింది. ప్రస్తుతం పనిలేకుండా ఆఫీసులో గోళ్లు గిల్లుకుంటూ కూర్చుంటున్న వారి సంఖ్యను తగ్గించేందుకు నిర్ణయం తీసుకున్నది. ఇందులో భాగంగా సచివాలయాలను ఏ,బి,సి అంటూ 3 క్యాటగిరీలుగా విభజించింది.
 
ఆ ప్రకారం కనీసం 2500 మంది ప్రజలకు ఓ సచివాలయం వుండేలా ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. దీనికి అనుగుణంగా సచివాలయ ఉద్యోగులను కూడా మల్టీపర్పస్ ఫంక్షనరీస్, టెక్నికల్ ఫంక్షనరీస్, యాస్పిరేషనల్ సెక్రటరీలుగా విభజించింది. ఈ ప్రకారంగా చూస్తే కనీసం 40 వేల ఉద్యోగాలు తగ్గిపోతాయని ఉద్యోగ సంఘాలు గగ్గోలు పెడుతున్నాయి. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

మంత్రి హోదాలో వచ్చా ... కారులో కొట్టిన డీజిల్ నా డబ్బుతోనే కొట్టించా... : మంత్రి నారా లోకేశ్ (Video)