Daily Horoscope

Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

08-01-2021 శుక్రవారం దినఫలాలు - కుబేరుడిని పూజించి అర్చించినా...

Advertiesment
Daily Horoscope
మేషం : స్త్రీలకు బంధువులు, చుట్టుపక్కల వారితో సఖ్యత నెలకొంటుంది. ఎలక్ట్రానిక్, కంప్యూటర్ రంగాల్లో వారికి ఒత్తిడి తప్పదు. ఆలయ సందర్శనాలలో హడావుడి, తొందరపాటు తగదు. ఉద్యోగస్తులు అధికారుల తీరుకు అనుగుణంగా మెలగాలి. తలపెట్టిన పనుల్లో స్వల్ప ఆటంకాలు, నిరుత్సాహం ఎదుర్కొంటారు. 
 
వృషభం : సన్నిహితులతో కలిసి చేపట్టిన పనులు సమీక్షిస్తారు. వాహనచోదకులకు ఏకాగ్రత ముఖ్యం. షాపింగ్ వ్యవహారాలలో అపరిచిత వ్యక్తుల పట్ల మెళకువ అవసరం. ఆలయ సందర్శనాలలో ఇబ్బందులు తప్పవు. ప్రతి విషయంలోనూ స్త్రీలదే పైచేయిగా ఉంటుంది. పత్రికా, వార్తా సంస్థలలోని వారికి తోటివారి వల్ల చికాకులు తప్పవు. 
 
మిథునం : వస్త్ర, ఫ్యాన్సీ, పచారీ, బేకరీ వ్యాపారులకు ఆశాజనకం. నూతన వ్యాపారాలు అంతంత మాత్రంగానే సాగుతాయి. చిట్స్, ఫైనాన్స్ వ్యాపారులకు ఖాతాదారుల ఒత్తిడి అధికం. ఉద్యోగస్తులకు సెలవు దొరకడం కష్టమే. నిరుద్యోగులు ఒక ప్రకటన పట్ల ఆకర్షితులవుతారు. ప్రతి విషయంలోనూ స్త్రీలదే పైచేయిగా ఉంటుంది. 
 
కర్కాటకం : ఆర్థిక వ్యవహారాలు, కుటుంబ సమస్యలు ఓ కొలిక్కి వస్తాయి. రాజకీయ నాయకులు సభలు, సమావేశాల్లో పాల్గొంటారు. రియల్ ఎస్టేట్ రంగాల వారికి నిరుత్సాహం తప్పదు. పుణ్యక్షేత్రాలలోని అధికారులకు కింది స్థాయి సిబ్బందితో అవస్థలు తప్పవు. మిమ్మలను పొగిడే వ్యక్తుల విషయంలో ఆచితూచి వ్యవహరించండి. 
 
సింహం : మీ ఉత్సాహాన్ని అదుపులో ఉంచుకోవడం శ్రేయస్కరం. యాదృచ్ఛికంగా ఒక పుణ్యక్షేత్రం సందర్శిస్తారు. ఉద్యోగులకు లీవు, అడ్వాన్సులు మంజూరవుతాయి. మార్కెటింగ్ రంగాల వారికి ఒత్తిడి అధికమవుతుంది. నిరుద్యోగులు ఒక ప్రకటన పట్ల ఆకర్షితులవుతారు. దంపతుల మధ్య అన్యోన్యత నెలకొంటుంది. 
 
కన్య : ఒక్కోసారి మీ జీవిత భాగస్వామి మనస్తత్వం అర్థం చేసుకోవడం కష్టమవుతుంది. మీ బంధువులను సహాయం అర్థించే బదులు మీరే ప్రత్యామ్నాయం చూసుకోవడం ఉత్తమం. బిల్లులు చెల్లిస్తారు. వైద్యులు ఆపరేషన్లను విజయవంతంగా పూర్తిచేస్తారు. ఉద్యోగస్తులు ఎంత శ్రమించినా గుర్తింపు అంతంత మాత్రంగానే ఉంటుంది. 
 
తుల : పెద్దల సలహాను పాటించి మీ గౌరవాన్ని నిలబెట్టుకుంటారు. కొత్త పనులు చేపట్టకుండా ప్రస్తుతం చేస్తున్నవాటిపైనే శ్రద్ధ వహించండి. క్రయ విక్రయాలు ప్రోత్సాహకరంగా సాగుతాయి. విద్యార్థులు అత్యుత్సాహం అనర్థాలకు దారితీస్తుంది. ప్రింటింగ్ రంగాల వారికి బకాయిల వసూళ్ళలో శ్రమాధిక్యత, ప్రయాసలు తప్పవు. 
 
వృశ్చికం : స్త్రీలకు టీవీ ఛానెళ్లు, కళాత్మక పోటీలకు సంబంధించిన సమాచారం అందుతుంది. వ్యాపారస్తులకు యాజమాన్యం ఒత్తిడి అధికం. కుటుంబంలో కలతలు తొలగి ప్రశాంతత నెలకొంటుంది. బంధువుల రాకపోకల వల్ల ధనం అధికంగా వ్యయం చేయవలసి వస్తుంది. దూర ప్రయాణం చేయవలసి వస్తుంది. 
 
ధనస్సు : దైవ దర్శనాలు, మొక్కుబడులు అతికష్టంమ్మీద అనుకూలిస్తాయి. విద్యార్థులు పరస్పరం విలువైన కానుకిలిచ్చిపుచ్చుకుంటారు. మీ కుటుంబీకుల కోసం ధనం విరివిగా వెచ్చిస్తారు. కొబ్బరి, పండ్లు, పూలు, చిరు వ్యాపారులకు లాభదాకయంగా ఉంటుంది. దూర ప్రయాణాల విషయమై ఒక నిర్ణయానికి వస్తారు. 
 
మకరం : రాబోయే ఆదాయానికి తగినట్టుగా ప్రణాళికలు రూపొందించుకుంటారు. స్త్రీల మనోవాంఛలు అవసరాలు నెరవేరుతాయి. మీ ఆంతరంగిక, వ్యాపార విషయాలు గోప్యంగా ఉంచండి. మాట్లాడలేని చోట మౌనం వహించడం మంచిది. పాత మిత్రులు, చిన్ననాటి వ్యక్తులను కలుసుకుంటారు. వ్యాపారాల్లో పెరిగిన పోటీ ఆందోళన కలిగిస్తుంది. 
 
కుంభం : బంధువుల రాకతో గృహంలో సందడి కానవస్తుంది. కొత్త పరిచయాలు ఏర్పడతాయి. ఎదుటివారితో మితంగా సంభాషించండి. అకాల భోజనం వల్ల మీ ఆరోగ్యంలో ఇబ్బందులు తప్పవు. కొత్త రుణాల కోసం అన్వేషిస్తారు. ఒక వ్యవహారం నిమిత్తం ఆకస్మికంగా ప్రయాణం చేయవలసి వస్తుంది. 
 
మీనం : భాగస్వామిక ఒప్పందాలు స్థిరాస్తి కొనుగోలుకు అనుకూలం. ముఖ్యమైన వ్యవహారాలు మీరే సమీక్షించుకోవడం ఉత్తమం. మీ సంతానం మొండివైఖి మీకు ఎంతో చికాకు కలిగిస్తుంది. దూర ప్రయాణాలలో చికాకులను ఎదుర్కొంటారు. నిరుద్యోగులు వచ్చిన తాత్కాలిక అవకాశాన్ని అందిపుచ్చుకోవడం ఉత్తమం. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

07-01-2021 గురువారం దినఫలాలు - సాయిబాబాను ఆరాధించినా...