Daily Horoscope

Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

02-04-2024 మంగళవారం దినఫలాలు - మార్కెటింగ్ రంగలోని వారికి ఒత్తిడి, శ్రమాధిక్యత...

Advertiesment
astro10
శ్రీ శోభకృత్ నామ సం|| ఫాల్గుణ ఐ|| అష్టమి ప.3.26 పూర్వాషాఢ సా.6.33 రా.వ.2.16 ల 3.48. ఉ.దు. 8.24 ల 9.12 రా.దు. 10.52 ల 11.39.
 
మేషం :- మార్కెటింగ్ రంగలోని వారికి ఒత్తిడి, శ్రమాధిక్యత తప్పవు. సంఘంలో ఉన్నతస్థాయి వ్యక్తులతో పరిచయాలు మీ పురోభివృద్ధికి నాంది పలుకుతాయి. ప్రయాణాల లక్ష్యం నెరవేరుతుంది. స్త్రీలకు చుట్టుపక్కల వారితో సత్సంబంధాలు నెలకొంటాయి. హోటల్, కేటరింగ్ రంగాల్లోవారు పనివారితో ఇబ్బందులు ఎదుర్కొంటారు.
 
వృషభం :- వ్యాపారస్తులకు కొత్త ప్రాజెక్టులు అందుతాయి. పాత రుణాలు తీరుస్తారు. దూర ప్రయాణాలలో ఇబ్బందులను ఎదుర్కొంటారు. మీ సంతానం మొండివైఖరి మీకు ఎంతో ఆందోళన కలిగిస్తుంది. చేపట్టినపనులు కొంత ఆలస్యంగానైనా సంతృప్తికరంగా పూర్తి చేస్తారు. సోదరుల విషయంలో విభేదాలు తలెత్తు సూచనలుకలవు. 
 
మిథునం :- ప్రముఖుల కలయిక ప్రయోజనకరంగా ఉంటుంది. పుణ్యక్షేత్రాల దర్శనం వల్ల మానసిక ప్రశాంతత చేకూరుతుంది. ప్రత్తి, పొగాకు వ్యాపారులకు ఆశాజనకంగా ఉంటుంది. మీ పొదుపరితనం కుటుంబ సభ్యులకు చికాకు కలిగిస్తుంది. కపటంలేని మీ ఆలోచనలు, సలహాలు మీకు అభిమానుల్ని సంపాదించిపెడుతుంది.
 
కర్కాటకం :- నిర్మాణ పనులు చురుకుగా సాగటంతో కొత్త ఉత్సాహం పొందుతారు. కొబ్బరి, పండ్ల, పూల, కూరగాయల వ్యాపారులకు సంతృప్తి, పురోభివృద్ధి. స్త్రీలకు ఆర్థికపరమైన సమస్యలు అధికమవుతాయి. షాపింగ్ వ్యవహారాల్లో మెళకువ వహించండి. గతంలో ఇచ్చిన హామీల వల్ల వర్తమానంలో ఇబ్బందు లెదురవుతాయి.
 
సింహం :- బ్యాంకింగ్ పనులు మందకొడిగా సాగుతాయి. ఖర్చులు పెరగటంతో రుణ యత్నాలు, చేబదుళ్ళు స్వీకరిస్తారు. సంఘంలో ఉన్నతస్థాయి వ్యక్తులతో పరిచయాలు మీ పురోభివృద్ధికి నాందీ పలుకుతాయి. వృత్తి, వ్యాపారులకు సమస్యలెదురైనా ఆదాయానికి కొదవ ఉండదు. ఏదైనా స్థిరాస్తి కొనుగోలు చేయాలనే ఆలోచన స్ఫురిస్తుంది.
 
కన్య :- ఉద్యోగరీత్యా ఆకస్మికంగా ప్రయాణం చేయవలసివస్తుంది. కష్ట సమయంలో బంధువులు అండగా నిలుస్తారు. స్త్రీలకు కొత్త వ్యాపకాలు, ఆలోచనలు స్ఫురిస్తాయి. రావలసిన ధనం అందటంతో ఆర్థిక ఇబ్బంది అంటూ ఏదీ ఉండదు. మార్కెటింగ్, ప్రైవేటు, పత్రికా రంగంలోని వారి అధిక శ్రమ, త్రిప్పట తప్పదు.
 
తుల :- గత విషయాలు జ్ఞప్తికి రాగలవు. నిర్మాణ పనులలో కాంట్రాక్టర్లకు ఏకాగ్రత, పర్యవేక్షణ ఎంతో అవసరం. ద్విచక్రవాహనం నడుపునపుడు జాగ్రత్త అవసరం. మీ అభిరుచికి తగిన వ్యక్తితో పరిచయాలేర్పడతాయి. విలువైన కానుకలందించి ప్రముఖులను ఆకట్టుకుంటారు. మొండి బకాయిలు వసూలు కాగలవు.
 
వృశ్చికం :- ఆర్థికంగా ఎదగాలనే మీ ఆశయం నిదానంగా ఫలిస్తుంది. బంధు మిత్రులతో ఉల్లాసంగా గడుపుతారు. పత్రికా సంస్థలలోని వారు ఎంత శ్రమించినా గుర్తింపు ఏమాత్రం ఉండదు. నిరుద్యోగులకు నూతన అవకాశాలు లభిస్తాయి. మీ ఉన్నతిని చాటుకోవాలనే తాపత్రయంతో ధనం విచ్చలవిడిగా వ్యయం చేస్తారు.
 
ధనస్సు :- కొంతమంది మీపై ఆధిపత్యం చెలాయించేందుకు యత్నిస్తారు. ఆకస్మికంగా మీలో వేదాంత ధోరణి కానరాగలదు. విదేశీయ వస్తువుల పట్ల ఆకర్షితులవుతారు. హోటల్, క్యాటరింగ్ రంగాల వారికి కలిసివస్తుంది. సంగీత, నృత్య కళాకారులకు గుర్తింపు లభిస్తుంది. స్త్రీలకు పుట్టింటిపై మమకారం పెరుగుతుంది.
 
మకరం :- స్వయం కృషితో బాగా రాణిస్తారు. విద్యార్థులకుతోటి వారి వల్ల సమస్యలు తప్పవు. ఉద్యోగస్తులు విలువైన కానుకలు అందించి అధికారులను ప్రసన్నం చేసుకుంటారు. ఇతరులకు పెద్ద మొత్తంలో ధనం ఇవ్వడం వల్ల ఇబ్బందులను ఎదుర్కుంటారు. సంఘంలో పలుకుబడి కలిగిన వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి.
 
కుంభం :- ఏ విషయంలోను ఏకపక్ష నిర్ణయం మంచిది కాదు. దూర ప్రయాణాలలో కొత్త వ్యక్తులతో పరిచయాలు పెంచుకుంటారు. స్త్రీలకు టి.వి. కార్యక్రమాలకు సంబంధించిన ఆహ్వానాలు అందుతాయి. స్థిరాస్తులు అమ్మకానికై చేయుయత్నాలు వాయిదా పడటం మంచిది. ఆత్మీయుల నుంచి బహుమతులు అందుకుంటారు.
 
మీనం :- రాజకీయ నాయకులు సభా సమావేశాలలో చురుకుగా పాల్గొంటారు. నేడు చేద్దామన్న పనులు రేపటి వాయిదా వేస్తారు. బ్యాంకింగ్ రంగంలోని వారికి పనిభారం, ఒత్తిడి, చికాకులు అధికమవుతాయి. స్త్రీలకు చుట్టు ప్రక్కల వారితో లౌకికం చాలా అవసరం. కోర్టు వ్యాజ్యాలు, ఫిర్యాదులు ఉపసంహరించుకుంటారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

01-04-2024 సోమవారం దినఫలాలు - శస్త్రచికిత్సలు విజయవంతంగా పూర్తిచేస్తారు....