Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

02-12-2025 మంగళవారం ఫలితాలు - ఖర్చులు అధికం, ప్రయోజనకరం...

Advertiesment
astro7

రామన్

, మంగళవారం, 2 డిశెంబరు 2025 (04:00 IST)
మేషం : అశ్వని, భరణి 1, 2, 3, 4 పాదములు, కృత్తిక 1వ పాదం
సర్వత్రా అనుకూలం. శ్రమతో కూడిన విజయాలున్నాయి. అవకాశాలను చేజిక్కించుకుంటారు. ఖర్చులు సామాన్యం. కొంతమొత్తం పొదుపు చేస్తారు. ఆత్మీయులతో సంభాషిస్తారు. పనులు, బాధ్యతలు స్వయంగా చూసుకోండి. ఏకాగ్రతతో వాహనం నడపండి. 
 
వృషభం : కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి, మృగశిర 1, 2, పాదాలు
ఆశావహదృక్పథంతో యత్నాలు సాగించండి. అవకాశం చేజారినా కుంగిపోవద్దు. సన్నిహితుల వ్యాఖ్యలు కార్యోన్ముఖులను చేస్తాయి. పనులు సావకాశంగా పూర్తి చేస్తారు. ఖర్చులు అధికం, ప్రయోజనకరం. సకాలంలో చెల్లింపులు జరుపుతారు. రశీదులు జాగ్రత్త. 
 
మిథునం : మృగశిర 3, 4 పాదాలు, ఆర్ద్ర, పునర్వసు 1, 2, 3 పాదాలు
లావాదేవీలు ముగుస్తాయి. అయిన వారితో సంప్రదింపులు జరుపుతారు. ఆలోచనలు కార్యరూపం దాల్చుతాయి. రోజువారీ ఖర్చులే ఉంటాయి. కొందరి రాక ఇబ్బంది కలిగిస్తుంది. కార్యక్రమాలు ముందుకు సాగవు. చేపట్టిన పనుల్లో ఒత్తిడి అధికం.
 
కర్కాటకం : పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష
గత అనుభవంతో జాగ్రత్త వహిస్తారు. ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి, ఆశించిన పదవి దక్కదు. బాధ్యతల నుంచి తప్పుకుంటారు. ఖర్చులు విపరీతం. రాబడిపై దృష్టి పెడతారు. దంపతుల మధ్య సఖ్యత నెలకొంటుంది. పత్రాల రెన్యువల్లో అలక్ష్యం తగదు.
 
సింహం : మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం
శుభకార్యాన్ని ఆర్భాటంగా చేస్తారు. మీ ఆతిధ్యం ఆకట్టుకుంటుంది. దూరపు బంధుత్వాలు బలపడతాయి. పనులు వేగవంతమవుతాయి. సంస్థల స్థాపనలపై దృష్టి పెడతారు. వ్యవహార ఒప్పందాల్లో ఏకాగ్రత వహిండి. ప్రలోభాలకు లొంగవద్దు. అప్రమత్తంగా ఉండాలి. 
 
కన్య : ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త, చిత్త 1, 2 పాదాలు
కీలక అంశాలపై పట్టుసాధిస్తారు. సమర్ధతకు గుర్తింపు లభిస్తుంది. మాటతీరుతో ఆకట్టుకుంటారు. పలుకుబడి కలిగిన వ్యక్తులతో పరిచయాలేర్పడతాయి. విలాసాలకు వ్యయం చేస్తారు. పనుల్లో ఒత్తిడి అధికం. ప్రయాణంలో జాగ్రత్త. బెట్టింగులకు పాల్పడవద్దు. 
 
తుల : చిత్త 3, 4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3 పాదాలు
గ్రహస్థితి అనుకూలంగా ఉంది. ప్రతికూలతలను ధైర్యంగా ఎదుర్కుంటారు. కొత్త ఆలోచనలు స్ఫురిస్తాయి. ధృఢసంకల్పంతో ముందుకు సాగుతారు. సకాలంలో చెల్లింపులు జరుపుతారు. పనులు పురమాయించవద్దు. కొత్త వ్యక్తులను ఓ కంట కనిపెట్టండి. 
 
వృశ్చికం : విశాఖ 4వ పాదం. అనూరాధ, జ్యేష్ట 1,2,3,4 పాదములు
కార్యసిద్ధికి సంకల్ప బలం ముఖ్యం. ఓర్పుతో యత్నాలు సాగించండి. సాయం ఆశించవద్దు. పరిచయస్తులు మీ ఆలోచనలను నీరుగార్చేందుకు యత్నిస్తారు. వ్యాఖ్యలు పట్టించుకోవద్దు. మీ కృషి నిదానంగా ఫలిస్తుంది. సావకాశంగా పనులు పూర్తి చేస్తారు.
 
ధనస్సు : మూల, పూర్వాషాడ 1 2 3 4 పాదములు, ఉత్తరాషాడ 1వ పాదం
శ్రమతో కూడిన విజయాలున్నాయి. పట్టుదలతో శ్రమించండి. అవకాశాలను వదులుకోవద్దు. సంకల్పబలంతోనే అనుకున్నది సాధిస్తారు. పొదుపు ధనం గ్రహిస్తారు. తలపెట్టిన పనులు ఒక పట్టాన సాగవు. ద్విచక్ర వాహనంపై దూరప్రయాణం తగదు.
 
మకరం : ఉత్తరాషాడ 2, 3, 4 పాదాలు. శ్రవణం, ధనిష్ట 1, 2 పాదాలు
మాటతీరు ఆకట్టుకుంటుంది. లక్ష్యాన్ని సాధిస్తారు. వ్యవహార జయం, ధనలాభం ఉన్నాయి. చెల్లింపులు, నగదు స్వీకరణలో జాగ్రత్త. ప్రణాళికాబద్ధంగా పనులు పూర్తిచేస్తారు. ప్రముఖులతో పరిచయాలు ఉన్నతికి తోడ్పడతాయి. అనవసర జోక్యం తగదు. 
 
కుంభం : ధనిష్ట 3, 4 పాదాలు, శతభిషం, పూర్వాబాద్ర 1, 2, 3 పాదాలు
ధైర్యంగా యత్నాలు సాగిస్తారు. ఒత్తిడి పెరగకుండా చూసుకోండి. ప్రలోభాలకు లొంగవద్దు. ప్రతి విషయం క్షుణ్ణంగా తెలుసుకోవాలి. సకాలంలో పనులు పూర్తి చేస్తారు. శుభకార్యానికి హాజరవుతారు. ఇంటిని నిర్లక్ష్యంగా వదిలి వెళ్లకండి. నగదు, ఆభరణాలు జాగ్రత్త. 
 
మీనం : పూర్వాబాద్ర 4వ పాదం, ఉత్తరాబాద్ర, రేవతి
సంద్రింపులు పురోగతిన సాగుతాయి. ఖర్చులు సామాన్యం. పొదుపు పథకాల పట్ల ఆకర్షితులవుతారు. ఫోన్ సందేశాలను పట్టించుకోవద్దు. సన్నిహితులకు మీ సమస్యలు తెలియజేయండి. పనులు ఒక పట్టాన సాగవు. పరిచయస్తుల ఆహ్వానం అందుకుంటారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

చాగంటి వల్లే అరుణాచలం ఆలయం తెలుగు భక్తుల రద్దీ పెరిగింది : నటుడు శివాజీరాజా