Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

03-07-2026 శుక్రవారం ఫలితాలు - మనోభీష్టం సిద్ధిస్తుంది

Advertiesment
Daily Astrology
Daily Astrology
మేషం : అశ్వని, భరణి 1, 2, 3, 4 పాదములు, కృత్తిక 1వ పాదం
అన్ని విధాలా అనుకూలం. ఆలోచనల్లో మార్పు వస్తుంది. కొత్త యత్నాలు చేపడతారు. ఖర్చులు తగ్గించుకుంటారు. పనులు, బాధ్యతలు స్వయంగా చూసుకోండి. ఆత్మీయులతో కాలక్షేపం చేస్తారు. పిల్లల చదువులపై దృష్టి పెడతారు. సన్మాన, సంస్కరణ సభల్లో పాల్గొంటారు.
 
వృషభం: కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి, మృగశిర 1, 2, పాదాలు
కార్యక్రమాలు నిర్విఘ్నంగా సాగుతాయి. కొత్త పనులకు ప్రణాళికలు వేసుకుంటారు. రావలసిన ధనం అందుతుంది. ఎదురుచూస్తున్న పత్రాలు అందుకుంటారు. వ్యవహారంలో ఆచితూచి అడుగేయండి. సన్నిహితులతో సంభాషిస్తారు. అనుకున్న మొక్కులు తీర్చుకుంటారు. 
 
మిధునం : మృగశిర 3, 4 పాదాలు, ఆర్ద్ర, పునర్వసు 1, 2, 3 పాదాలు
నూతన యత్నాలకు శ్రీకారం చుడతారు. పెద్దలు సాయం అందిస్తారు. ఏకాగ్రత తగ్గకుండా చూసుకోండి. సన్నిహితులతో సంభాషణ మరింత ఉత్సాహాన్నిస్తుంది, ఖర్చులు విపరీతం. దంపతుల మధ్య అకారణ కలహం, సన్నిహితుల జోక్యంతో సమస్య సద్దుమణుగుతుంది.
 
కర్కాటకం : పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష
తలపెట్టిన కార్యం సఫలమవుతుంది. అవకాశాలు కలిసివస్తాయి. పిల్లల భవిష్యత్తుపై దృష్టిపెడతారు. స్థిరాస్తి మూలక ధనం అందుతుంది. ఖర్చులు సామాన్యం, నగదు డ్రా చేసేటప్పుడు జాగ్రత్త, నోటీసులు, ఆహ్వానం అందుకుంటారు. పనులు మొండిగా పూర్తి చేస్తారు.
 
సింహం: మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం
లక్ష్యసాధనకు ఓర్పు ప్రధానం. ఆశావహదృక్పధంతో మెలగండి. పనులు ఒక పట్టాన పూర్తికావు. ఖర్చులు విపరీతం. ఒక అవసరానికి ఉంచిన ధనం మరోదానికి ఖర్చు చేస్తారు. అవకాశాలు చేజారిపోతాయి. ముఖ్యుల కలయిక వీలుపడదు. బెట్టింగ్ జోలికి పోవద్దు. 
 
కన్య: ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త, చిత్త 1, 2 పాదాలు
శ్రమించినా ఫలితం అంతంత మాత్రమే. కార్యసాధనకు మరింత శ్రమించాలి. పనులు మధ్యలో ఆపివేయొద్దు. ముఖ్యుల కలయిక వీలుపడదు. మొండిగా అడుగు ముందుకేస్తారు. పెద్దల ప్రోత్సాహం ఉంటుంది. రావలసిన ధనం అందుతుంది. ఖర్చులు తగ్గించుకుంటారు. 
 
తుల : చిత్త 3, 4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3 పాదాలు:
అనుకున్న లక్ష్యం సాధిస్తారు. అవకాశాలు కలిసివస్తాయి. మీ కృషి స్ఫూర్తిదాయకమవుతుంది. ఆదాయానికి తగ్గట్టుగా ఖర్చులుంటాయి. పెట్టుబడులకు తరుణం కాదు. ఆత్మీయుల వ్యాఖ్యలు ఆలోచింపచేస్తాయి. చాకచక్యంగా వ్యవహరిస్తారు. వాహనం ఇతరులకివ్వవద్దు. 
 
వృశ్చికం : విశాఖ 4వ పాదం. అనూరాధ, జ్యేష్ట 1,2,3,4 పాదములు
మనోభీష్టం సిద్ధిస్తుంది. వాక్చాతుర్యంతో రాణిస్తారు. ప్రముఖులతో పరిచయాలేర్పడతాయి. వ్యతిరేకులతో జాగ్రత్త. పొగిడే వ్యక్తుల అంతర్యం గ్రహించండి. ఆర్భాటాలకు ఖర్చుచేస్తారు. కష్టమనుకున్న పనులు తేలికగా పూర్తవుతాయి. అప్రియమైన వార్త వింటారు. 
 
ధనస్సు: మూల, పూర్వాషాడ 1,2,3,4 పాదములు, ఉత్తరాషాడ 1వ పాదం
సర్వత్రా అనుకూలమే. కీలక నిర్ణయాలు తీసుకుంటారు. మనోధైర్యంతో శ్రమించండి. మీ కృషి తక్షణం ఫలిస్తుంది. వ్యతిరేకులు సన్నిహితులవుతారు. ఆదాయం బాగుంటుంది. దీర్ఘకాలిక సమస్యల నుంచి బయటపడతారు. పోగొట్టుకున్న పత్రాలు తిరిగి పొందుతారు. 
 
మకరం : ఉత్తరాషాడ 2, 3, 4 పాదాలు, శ్రవణం, ధనిష్ట 1, 2 పాదాలు
సంప్రదింపులతో తీరిక ఉండదు. అవిశ్రాంతంగా శ్రమిస్తారు. పనులు ప్రారంభంలో ఆటంకాలెదురవుతాయి. ధైర్యంగా యత్నాలు సాగించండి. సకాలంలో వాయిదాలు చెల్లిస్తారు. దంపతుల మధ్య అవగాహన నెలకొంటుంది. ప్రముఖుల సందర్శనం వీలుపడదు. 
 
కుంభం : ధనిష్ట 3, 4 పాదాలు, శతభిషం, పూర్వాబాద్ర 1, 2, 3 పాదాలు
యత్నాలు ప్రోత్సాహకరంగా సాగుతాయి. మీ కృషి తక్షణమే ఫలిస్తుంది. అవకాశాలను చేజిక్కించుకుంటారు. మీ కలుపుగోలుతనం ఆకట్టుకుంటుంది. విలాసవస్తువులు కొనుగోలు చేస్తారు. చేపట్టిన పనులు చురుకుగా సాగుతాయి. కొత్తప్రదేశాలు సందర్శిస్తారు. 
 
మీనం: పూర్వాబాద్ర 4వ పాదం, ఉత్తరాబాద్ర, రేవతి
సన్నిహితుల వ్యాఖ్యలు ఉత్సాహపరుస్తాయి. ధైర్యంగా అడుగు ముందుకేస్తారు. శ్రమ ఫలించకున్నా నిరుత్సాహపడవద్దు. కొంతమొత్తం ధనం అందుతుంది. సకాలంలో చెల్లింపులు జరుపుతారు. ఫోన్ సందేశాలు పట్టించుకోవద్దు. పనులు ఒక పట్టాన సాగవు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

Sankatahara Chaturthi 2026: జూలై 3న కృష్ణ పింగళ సంకష్టి చతుర్థి.. 21 జిల్లేడు ఆకుల పూజ చేసినా..