Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

04-10-2025 శనివారం దిన ఫలితాలు - ఖర్చులు సామాన్యం.. చెల్లింపుల్లో జాగ్రత్త...

Advertiesment
Astrology

రామన్

, శనివారం, 4 అక్టోబరు 2025 (04:00 IST)
మేషం : అశ్వని, భరణి 1, 2, 3, 4 పాదములు, కృత్తిక 1వ పాదం
లక్ష్యసాధనకు ఓర్పు ప్రధానం. ఆశావహదృక్పథంతో మెలగండి. ఏ విషయాన్నీ తేలికగా తీసుకోవద్దు. ఊహించని ఖర్చు నిరుత్సాహపరుస్తుంది. కొత్త వ్యక్తులతో జాగ్రత్త. కనిపించకుండా పోయిన వస్తువులు లభ్యమవుతాయి. పాత మిత్రులను కలుసుకుంటారు.
 
వృషభం : కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి, మృగశిర 1, 2, పాదాలు
సంప్రదింపులు నిరుత్సాహపరుస్తాయి. అనుకూలతలు అంతంత మాత్రమే. సకాలంలో చెల్లింపులు జరుపుతారు. ఒక ఆహ్వానం ఆలోచింపచేస్తుంది. పనులు మొక్కుబడిగా పూర్తి చేస్తారు. అనవసర విషయాల్లో జోక్యం తగదు. శుభకార్యానికి హాజరు కాలేరు.
 
మిథునం : మృగశిర 3, 4 పాదాలు, ఆర్ద్ర, పునర్వసు 1, 2, 3 పాదాలు
ప్రతికూలతలకు ధీటుగా స్పందిస్తారు. మీ కష్టం ఫలిస్తుంది. వ్యతిరేకులు సన్నిహితులవుతారు. ఖర్చులు విపరీతం. విలువైన వస్తువులు జాగ్రత్త. పనులు అప్పగించవద్దు. ముఖ్యులకు ఆత్మీయ వీడ్కోలు పలుకుతారు. మీ అలవాట్లు వివాదాస్పదమవుతాయి. 
 
కర్కాటకం : పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష
అవిశ్రాంతంగా శ్రమిస్తారు. పనిభారం, విశ్రాంతి లోపం. రోజువారీ ఖర్చులే ఉంటాయి. వివాహ యత్నాలు తీవ్రంగా సాగిస్తారు. ఫోన్ సందేశాలను నమ్మవద్దు. ప్రతి విషయం స్వయంగా తెలుసుకోండి. సకాలంలో పనులు పూర్తి చేస్తారు. ఆరోగ్యం కుదుటపడుతుంది.
 
సింహం : మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం
కీలక విషయాలపై పట్టు సాధిస్తారు. రావలసిన ధనం అందుతుంది. ఊహించిన ఖర్చులే ఉంటాయి. సావకాశంగా పనులు పూర్తి చేస్తారు. పరిచయాలు బలపడతాయి. గుట్టుగా మెలగండి. అనుకోని సంఘటనలు ఎదురవుతాయి. పెద్దలతో సంప్రదింపులు జరుపుతారు. 
 
కన్య : ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త, చిత్త 1, 2 పాదాలు
పట్టుదలతో యత్నాలు సాగించండి. ఖర్చులు విపరీతం. అవసరాలు వాయిదా వేసుకుంటారు. అవకాశాలు చేజారిపోతాయి. ఆప్తుల కలయికతో కుదుటపడతారు. పనుల్లో శ్రమ, చికాకులు అధికం. కొత్త వ్యక్తులతో జాగ్రత్త. సేవ, పుణ్య కార్యాల్లో పాల్గొంటారు. 
 
తుల : చిత్త 3, 4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3 పాదాలు
వ్యవహారానుకూలత ఉంది. సముచిత నిర్ణయాలు తీసుకుంటారు. రావలసిన ధనం అందుతుంది. పెద్ద ఖర్చు తగిలే ఆస్కారం ఉంది. ధనం మితంగా వ్యయం చేయండి. పనులు హడావుడిగా సాగుతాయి. కొంతమంది మాటతీరు మనస్తాపం కలిగిస్తుంది. 
 
వృశ్చికం : విశాఖ 4వ పాదం. అనూరాధ, జ్యేష్ట 1,2,3,4 పాదములు
సంకల్పం సిద్ధిస్తుంది. ఉల్లాసంగా గడుపుతారు. వాహనసౌఖ్యం, వస్త్రప్రాప్తి ఉన్నాయి. ఆప్తులకు సాయం అందిస్తారు. ప్రముఖులతో పరిచయాలేర్పడతాయి. నిలిపివేసిన పనులు పూర్తి చేస్తారు. అందరితోను మితంగా సంభాషించండి. ప్రయాణం సజావుగా సాగుతుంది. 
 
ధనస్సు : మూల, పూర్వాషాడ 1 2 3 4 పాదములు, ఉత్తరాషాడ 1వ పాదం
సర్వత్రా కలిసివచ్చే సమయం. కొత్త పరిచయాలేర్పడతాయి. దుబారా ఖర్చులు తగ్గించుకుంటారు. పనులు వేగవంతమవుతాయి. ఆత్మీయుల రాక సంతోషాన్నిస్తుంది. గృహంలో మార్పుచేర్పులు చేపడతారు. విలువైన వస్తువులు జాగ్రత్త. వివాదాలు కొలిక్కివస్తాయి. 
 
మకరం : ఉత్తరాషాడ 2, 3, 4 పాదాలు. శ్రవణం, ధనిష్ట 1, 2 పాదాలు
సమర్థతకు గుర్తింపు లభిస్తుంది. పురస్కారాలు అందుకుంటారు. రోజువారీ ఖర్చులే ఉంటాయి. ఆహ్వానం అందుకుంటారు. ఒక సమాచారం ఆలోచింపచేస్తుంది. పనులు అర్థాంతంగా ముగిస్తారు. దంపతుల మధ్య దాపరికం తగదు. వేడుకకు హాజరవుతారు. 
 
కుంభం : ధనిష్ట 3, 4 పాదాలు, శతభిషం, పూర్వాబాద్ర 1, 2, 3 పాదాలు
ఖర్చులు అధికం. పెట్టుబడులు కలిసిరావు. అవకాశాలను అందిపుచ్చుకుంటారు. ఓర్పుతో పనులు పూర్తిచేస్తారు. అప్రియమైన వార్త వింటారు. కార్యక్రమాలు ముందుకు సాగవు. ఆసక్తికరమైన విషయాలు తెలుసుకుంటారు. వాహనం నడిపేటపుడు జాగ్రత్త. 
 
మీనం : పూర్వాబాద్ర 4వ పాదం, ఉత్తరాబాద్ర, రేవతి
ఖర్చులు సామాన్యం. చెల్లింపుల్లో జాగ్రత్త. పదవుల కోసం యత్నాలు సాగిస్తారు. ఎవరినీ అతిగా నమ్మవద్దు. మీ సామర్ధ్యంపై నమ్మకం పెంచుకోండి. కష్టమనుకున్న పనులు తేలికగా పూర్తి చేస్తారు. శుభకార్యానికి హాజరవుతారు. బంధుత్వాలు బలపడతాయి.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

Tirumala : శ్రీవారి బ్రహ్మోత్సవాలు.. రూ.25 కోట్లకు పైగా కానుకలు