Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

06-11-2024 బుధవారం రాశిఫలాలు - అవిశ్రాంతంగా శ్రమిస్తారు.. మీ కష్టం ఫలిస్తుంది...

Advertiesment
Mithunam

రామన్

, బుధవారం, 6 నవంబరు 2024 (04:00 IST)
మేషం : అశ్వని, భరణి 1, 2, 3, 4 పాదములు, కృత్తిక 1వ పాదం
సంప్రదింపులతో తీరిక ఉండదు. మీ అభిప్రాయాలను స్పష్టంగా తెలియజేయండి. పనులు మొండిగా పూర్తి చేస్తారు. ఖర్చులు విపరీతం. మీ శ్రీమతి ధోరణి చికాకుపరుస్తుంది. పిల్లల భవిష్యత్తుపై దృష్టి పెడతారు. అపరిచితులతో మితంగా సంభాషించండి. 
 
వృషభం : కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి, మృగశిర 1, 2, పాదాలు
ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి. ఆసక్తికరమైన విషయాలు తెలుసుకుంటారు. అనుకోని సంఘటనలు ఎదురవుతాయి. పనులు, వాయిదా వేసుకుంటారు. ఆరోగ్యం జాగ్రత్త. ఆప్తులతో సంభాషణ ఉపశమనం కలిగిస్తుంది. ఏకాగ్రతతో వాహనం నడపండి.
 
మిథునం : మృగశిర 3, 4 పాదాలు, ఆర్ద్ర, పునర్వసు 1, 2, 3 పాదాలు
శుభకార్యాన్ని ఆర్భాటంగా చేస్తారు. మీ ఉన్నతి కొందరికి అపోహ కలిగిస్తుంది. విమర్శలు పట్టించుకోవద్దు. ఖర్చులు అంచనాలను మించుతాయి. నిలిపివేసిన పనులు పునఃప్రారంభమవుతాయి. పోగొట్టుకున్న పత్రాలు సంపాదిస్తారు. కీలక చర్చల్లో పాల్గొంటారు.
 
కర్కాటకం : పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష
అవిశ్రాంతంగా శ్రమిస్తారు. మీ కష్టం ఫలిస్తుంది. దైవకార్యానికి విపరీతంగా వ్యయం చేస్తారు. దూరపు బంధుత్వాలు బలపడతాయి. పనులు పురమాయించవద్దు. పరిచయం లేని వ్యక్తులతో జాగ్రత్త. కీలక పత్రాలు అందుకుంటారు. పుణ్యకార్యంలో పాల్గొంటారు. 
 
సింహం : మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం
కార్యసాధనకు మరింత శ్రమించాలి. సమర్ధతకు గుర్తింపు ఉండదు. దుబారా ఖర్చులు విపరీతం. పనులు హడావుడిగా సాగుతాయి. ఒక సమాచారం ఆలోచింపచేస్తుంది. సన్నిహితులతో సంభాషిస్తారు. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. విందుకు హాజరవుతారు. 
 
కన్య : ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త, చిత్త 1, 2 పాదాలు
ఆచితూచి అడుగేయండి. మిమ్ములను తప్పుదారి పట్టించేందుకు కొందరు యత్నిస్తారు. ప్రలోభాలకు లొంగవద్దు. బ్యాంకు వివరాలు గోప్యంగా ఉంచండి. చేపట్టిన పనులు సాగవు. విలాసాలకు వ్యయం చేస్తారు. వాహనం ఇతరులకివ్వవద్దు. ప్రయాణంలో జాగ్రత్త. 
 
తుల : చిత్త 3, 4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3 పాదాలు
చాకచక్యంగా వ్యవహరిస్తారు. సమర్ధతకు గుర్తింపు లభిస్తుంది. అనుకున్న విధంగా పనులు పూర్తి చేస్తారు. ఖర్చులు విపరీతం. మీ చొరవతో శుభకార్యం నిశ్చయమవుతుంది. దూరపు బంధుత్వాలు బలపడతాయి. ఉద్యోగస్తుల కార్యక్రమాలు ప్రశాంతంగా సాగుతాయి. 
 
వృశ్చికం : విశాఖ 4వ పాదం. అనూరాధ, జ్యేష్ట 1,2,3,4 పాదములు
బాధ్యతలు స్వీకరిస్తారు. మీ కలుపుగోలుతనం ఆకట్టుకుంటుంది. విలాసాలకు వ్యయం చేస్తారు. ఆగిపోయిన పనులు పునఃప్రారంభమవుతాయి. అప్రియమైన వార్త వినవలసి వస్తుంది. కార్యక్రమాలు, పనులు సాగవు. ఆకస్మిక ప్రయాణం తలపెడతారు. 
 
ధనస్సు : మూల, పూర్వాషాడ 1 2 3 4 పాదములు, ఉత్తరాషాడ 1వ పాదం
ఒత్తిడి పెరగకుండా చూసుకోండి. పరిచయస్తుల వ్యాఖ్యలు ఉద్రేకపరుస్తాయి. ఏ విషయాన్నీ పెద్దగా పట్టించుకోవద్దు. పనులు వేగవంతమవుతాయి. రోజువారీ ఖర్చులే ఉంటాయి. అందరితోను మితంగా సంభాషించండి. ప్రముఖులతో పరిచయాలేర్పడతాయి.
 
మకరం : ఉత్తరాషాడ 2, 3, 4 పాదాలు. శ్రవణం, ధనిష్ట 1, 2 పాదాలు
ఖరీదైన వస్తువులు కొనుగోలు చేస్తారు. రశీదులు, పత్రాలు జాగ్రత్త. పనులు చురుకుగా సాగుతాయి. ఆహ్వానం అందుకుంటారు. కొందరి రాక అసౌకర్యం కలిగిస్తుంది. దంపతుల మధ్య సఖ్యతలోపం. కనిపించకుండా పోయిన వస్తువులు లభ్యమవుతాయి.
 
కుంభం : ధనిష్ట 3, 4 పాదాలు, శతభిషం, పూర్వాబాద్ర 1, 2, 3 పాదాలు
వ్యవహారాలతో తీరిక ఉండదు. ఆలోచనలతో సతమతమవుతారు. ఖర్చులు అంచనాలను మించుతాయి. చేపట్టిన పనులు ఒక పట్టాన పూర్తి కావు. చీటికిమాటికి అసహనం చెందుతారు. ఆత్మీయులతో సంభాషిస్తారు. వ్యాపారాభివృద్ధికి మరింత శ్రమించాలి. 
 
మీనం : పూర్వాబాద్ర 4వ పాదం, ఉత్తరాబాద్ర, రేవతి
కార్యసాధనకు ఓర్పు ప్రధానం. మీ సామర్ధ్యంపై నమ్మకం పెంచుకోండి. దంపతుల మధ్య సఖ్యత నెలకొంటుంది. పరిచయాలు బలపడతాయి. ఖర్చులు విపరీతం. సకాలంలో పనులు పూర్తి చేస్తారు. ప్రముఖుల సందర్శనం వీలుపడదు. ఆరోగ్యం జాగ్రత్త. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

నాగుల చవితి: పుట్టలో పాలు, పూజ ఎలా చేయాలి.. ఈ శ్లోకం.. ఈ మంత్రం చదివితే?