Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

11-06-2026 గురువారం ఫలితాలు - ఆర్థికంగా బాగున్నా సంతృప్తి ఉండదు...

Advertiesment
simha raashi
మేషం : అశ్వని, భరణి 1, 2, 3, 4 పాదములు, కృత్తిక 1వ పాదం
లక్ష్యం నెరవేరుతుంది. స్థిమితంగా పనులు పూర్తి చేస్తారు. రోజువారీ ఖర్చులే ఉంటాయి. కొత్త వ్యక్తులతో జాగ్రత్త. ఆంతరంగిక విషయాలు వెల్లడించవద్దు. కనిపించకుండా పోయిన పత్రాలు లభ్యమవుతాయి. ప్రముఖుల ఇంటర్వ్యూ కోసం పడిగాపులు తప్పవు.
 
వృషభం : కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి, మృగశిర 1, 2, పాదాలు
వ్యవహారాల్లో తప్పటడుగు వేస్తారు. అంచనాలు ఫలించవు. మీ మాటతీరు అపోహాలకు దారితీస్తుంది. ఆర్థికంగా బాగున్నా సంతృప్తి ఉండదు. తెలియని వెలితి వెన్నాడుతుంది ఖర్చులు సామాన్యం. పనులు మొండిగా పూర్తిచేస్తారు. ఫోన్ సందేశాలను పట్టించుకోవద్దు.
 
మిథునం : మృగశిర 3, 4 పాదాలు, ఆర్ద్ర, పునర్వసు 1, 2, 3 పాదాలు
కార్యసాధనకు మరింత శ్రమించాలి. సాయం ఆశించవద్దు. లావాదేవీలతో తీరిక ఉండదు. పనులు మొక్కుబడిగా పూర్తి చేస్తారు. ఖర్చులు విపరీతం. దంపతుల మధ్య అవగాహన నెలకొంటుంది. ప్రియతముల రాక ఉత్సాహాన్నిస్తుంది. కొత్త యత్నాలు చేపడతారు. 
 
కర్కాటకం : పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష
అనుకూలతలున్నాయి. రుణవిముక్తులవుతారు. వ్యాపకాలు అధికమవుతాయి. కొత్త యత్నాలు ప్రారంభిస్తారు. శ్రమకు తగిన ఫలితాలున్నాయి. ఆర్భాటాలకు వ్యయం చేస్తారు. అందరితోను మితంగా సంభాషించండి. పుణ్యక్షేత్రం, కొత్త ప్రదేశాలు సందర్శిస్తారు. 
 
సింహం : మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం
కలిసివచ్చే సమయం. సమర్ధతను చాటుకుంటారు. వ్యవహారానుకూలత ఉంది. పరిచయాలు ఉన్నతికి తోడ్పడతాయి. ఖర్చులు తగ్గించుకుంటారు. వివాహయత్నం ఫలించే సూచనలున్నాయి. తొందరపడి హామీలివ్వవద్దు. సావకాశంగా పనులు పూర్తిస్తారు. బాధ్యతలు స్వయంగా చూసుకోవాలి. 
 
కన్య : ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త, చిత్త 1, 2 పాదాలు
ఆర్ధికంగా ఆశించిన ఫలితాలున్నాయి. వ్యవహారాల్లో తగిన నిర్ణయాలు తీసుకుంటారు. దుబారా ఖర్చులు విపరీతం. పనులు సకాలంలో పూర్తి చేస్తారు. మితంగా సంభాషించండి. మీ నుంచి విషయసేకరణకు కొంతమంది యత్నిస్తారు. బ్యాంకు వివరాలు వెల్లడించవద్దు. 
 
తుల : చిత్త 3, 4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3 పాదాలు
ధైర్యంగా యత్నాలు సాగించండి. పట్టుదలతో శ్రమిస్తే విజయం తథ్యం. వ్యాఖ్యలు పట్టించుకోవద్దు. మీ సమర్థతపై నమ్మకం పెంచుకోండి. రోజువారీ ఖర్చులే ఉంటాయి. అందరితోను మితంగా సంభాషించండి. ఒకరి వద్ద మరొకరి ప్రస్తావన తీసుకురావద్దు. 
 
వృశ్చికం : విశాఖ 4వ పాదం. అనూరాధ, జ్యేష్ట 1,2,3,4 పాదములు
సమయస్ఫూర్తిగా మెలగాలి. అనాలోచిత నిర్ణయాలు తగవు. అనుభవజ్ఞుల సలహా పాటించండి. దంపతుల మధ్య దాపరికం తగదు. ఖర్చులు అధికం. నగదు డ్రా చేసేటపుడు జాగ్రత్త. ప్రతి విషయం క్షుణ్ణంగా తెలుసుకోండి. ముఖ్యమైన పత్రాలు జాగ్రత్త. 
 
ధనస్సు : మూల, పూర్వాషాడ 1 2 3 4 పాదములు, ఉత్తరాషాడ 1వ పాదం
శ్రమాధిక్యత మినహా ఫలితం ఉండదు. ఒత్తిడి పెరగకుండా చూసుకోండి. పనులు అర్థాంతగా ముగించవలసి వస్తుంది. కొందరి వ్యాఖ్యలు నిరుత్సాహపరుస్తాయి. రోజువారీ ఖర్చులే ఉంటాయి. కిట్టని వ్యక్తులు తప్పుదారి పట్టిస్తారు. ధన ప్రలోభాలకు లొంగవద్దు.
 
మకరం : ఉత్తరాషాడ 2, 3, 4 పాదాలు. శ్రవణం, ధనిష్ట 1, 2 పాదాలు
ప్రణాళికలు వేసుకుంటారు. అంచనాలు ఫలిస్తాయి. ప్రముఖులకు సన్నిహితులవుతారు. వ్యతిరేకులతో జాగ్రత్త. విలాసాలకు వ్యయం చేస్తారు. ధనసహాయం తగదు. అనుకున్న విధంగా పనులు పూర్తవుతాయి. ఉల్లాసంగా గడుపుతారు. ముఖ్యులకు వీడ్కోలు పలుకుతారు. 
 
కుంభం : ధనిష్ట 3, 4 పాదాలు, శతభిషం, పూర్వాబాద్ర 1, 2, 3 పాదాలు
ధైర్యంగా యత్నాలు సాగించండి. అవకాశాలను వదులుకోవద్దు. అందరితోనూ మితంగా సంభాషించండి. కొంతమంది మీ వ్యాఖ్యలను వక్రీకరిస్తారు. ఖర్చులు విపరీతం. పనులు సానుకూలమవుతాయి. విందుకు హాజరవుతారు. మీ బలహీనతలు అదుపులో ఉంచుకోండి.
 
మీనం : పూర్వాబాద్ర 4వ పాదం, ఉత్తరాబాద్ర, రేవతి
లక్ష్యసాధనకు ఓర్పు, పట్టుదల ప్రధానం. నిరుత్సాహం వీడి యత్నాలు సాగించండి. ప్రియతముల వ్యాఖ్యలు కార్మోన్యుఖులను చేస్తాయి. చాకచక్యంగా పనులు చక్కబెట్టుకుంటారు. ఖర్చులు అదుపులో ఉండవు. ధనసమస్యలు తలెత్తకుండా జాగ్రత్త వహించండి. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

10-06-2026 బుధవారం ఫలితాలు- విశేష ఫలితాలున్నాయి