Daily Horoscope

Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

13-07-2023 గురువారం రాశిఫలాలు - సాయిబాబాను స్తుతిస్తే..?

Advertiesment
Daily Horoscope
సాయిబాబాను ఆరాధించిన శుభం కలుగుతుంది.
 
మేషం:- ఆర్ధికంగా బాగుగా స్థిరపడతారు. హోటల్, తినుబండారాల వ్యపారస్థులకు అనుకూలంగా ఉంటుంది. స్త్రీలకు పనివారితో ఇబ్బందులు తప్పవు. కోర్టు వ్యవహారాలలో జాగ్రత్త అవసరం. మీ సంతానం మొండివైఖరి మీకు ఎంతో చికాకు కలిగిస్తుంది. ఉద్యోగస్తులకు పై అధికారుల నుంచి మంచి గుర్తింపు లభిస్తుంది.
 
వృషభం :- బంధువుల రాక మీకు ఆనందాన్ని ఇస్తుంది. కొబ్బరి, పండ్లు, పూలు, చిరువ్యాపారులకు కలిసివస్తుంది. మీ యత్నాలకు సన్నిహితులు, కుటుంబీకుల నుంచి ప్రోత్సాహం లభిస్తుంది. ఉద్యోగస్తులు అధికారులను మెప్పించటానికి బాగా శ్రమించాల్సి ఉంటుంది. ఆదాయానికి తగినట్లు ఖర్చులు ఉంటాయి. 
 
మిధునం:- ప్రింటింగ్ రంగాల వారికి సదవకాశాలు లభిస్తాయి. ప్రముఖులను కలుసుకుంటారు. కుటుంబీకులతో చికాకులు ఎదుర్కొనక తప్పదు. వృత్తి వ్యాపారాల్లో మార్పులు అనుకూలిస్తాయి. ఉద్యోగస్తులు పై అధికారులతో సంభాషించేటపుడు మెళకువ అవసరం. విద్య సంస్థలలో వారికి, ఉపాధ్యాయులకు అనుకూలమైన కాలం.
 
కర్కాటకం:- కాంట్రాక్టు దారులకు ఆందోళనలు కొన్ని సందర్భము లందు ధననష్టము సంభవించును. సోదరీ సోదరులతో సత్సంబంధాలు నెలకొంటాయి. కొత్త వ్యక్తులతో పరిచయాలు, వ్యపకాలు అధికమవుతాయి. వ్యాపారాభివృద్ధికై చేయు ప్రయత్నాలలో సఫలీకృతులవుతారు. హామీలు, మధ్యవర్తిత్వాలకు దూరంగా ఉండటం క్షేమదాయకం.
 
సింహం:- కొంతమంది మీ నుండి విషయాలు రాబట్టటానికి యత్నిస్తారు. నిరుద్యోగులు నిర్లిప్తత ధోరణి వల్ల సదవకాశాలు జారవిడుచుకుంటారు. కోర్టు పనులు, లిటిగేషన్లు పరిష్కారం అవుతాయి. రాజకీయనాయకులు సభ, సమావేశాల్లో పాల్గొంటారు. స్త్రీలకు మీ చుట్టుప్రక్కల వారితో సమస్యలు తలెత్తుతాయి.
 
కన్య:- బంధువులతో సత్సంబంధాలు నెలకొంటాయి. దైవ, పుణ్య కార్యాల్లో ప్రముఖంగా వ్యవహరిస్తారు. ఇసుక, క్వారీ కాంట్రాక్టర్లకు ఊహించని సమస్యలెదురవుతాయి. ఆరోగ్యంలో మెళకువ అవసరం. చిన్నతరహా పరిశ్రమలలో వారికి పురోభివృద్ధి కానవస్తుంది. స్థిరాస్తి కొనుగోలు లేదా అభివృద్ధి దిశగా మీ ఆలోచనలు ఉంటాయి.
 
తుల:- ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. ఇతరులను అతిగా విశ్వసించటం వల్ల నష్టపోయే ప్రమాదముంది జాగ్రత్త వహించండి. పుణ్యక్షేత్రాల దర్శనం వల్ల మానసిక ప్రశాంతత చేకూరుతుంది. రచయితలకు, పత్రికా రంగాలోని వారికి చికాకులు తప్పవు. ఉద్యోగస్తులు స్థానచలన యత్నాల్లో కొంత పురోగతి కనిపిస్తుంది.
 
వృశ్చికం:- చిట్‌ఫండ్, ఫైనాన్సు రంగాలలోని వారికి ఖాతాదారుల నుంచి చికాకులను ఎదుర్కుంటారు. రాజకీయాలో వారికి ఊహించని అవరోధాలు తలెత్తినా నెమ్మదిగా సమసిపోతాయి. ఊహించని వ్యక్తుల నుంచి అందిన సమాచారం మీకు బాగా ఉపకరిస్తుంది. కొబ్బరి, పండ్ల, పానీయ వ్యాపారస్తులకు అనుకూలమైన కాలం. 
 
ధనస్సు:- దైవ సేవా కార్యక్రమాలలో చురుకుగా పాల్గొంటారు. మీ బంధువులను సహాయం అర్ధించే బదులు మీరే ప్రత్యామ్నాయం చూసుకోవటం ఉత్తమం. కుటుంబ సభ్యుల వైఖరి ఆవేదన కలిగిస్తుంది. రాజకీయాల్లో వారి కార్యక్రమాలు వాయిదాపడుట వల్ల ఆందోళనకు గురౌతారు. పొదుపు పథకాల దిశగా మీ ఆలోచనలు ఉంటాయి.
 
మకరం:- ప్రముఖులకు కానుకలు సమర్పించి ప్రముఖులను ప్రసన్నం చేసుకుంటారు. నిరుద్యోగులు ఇంటర్వ్యూలలో జయంపొందుతారు. విదేశాల్లోని ఆత్మీయుల క్షేమసమాచారాలు సంతృప్తినిస్తాయి. స్త్రీలు నూతన పరిచయస్తులతో మితంగా సంభాషించటం మంచిది. మీ సోదరి మొండి వైఖరి మీకు ఎంతో చికాకు కలిగిస్తుంది.
 
కుంభం:- దూరప్రయాణాలలో అపరిచితులపట్ల మెళకువ అవసరం. సృజనాత్మకంగా వ్యవహరించినప్పుడు మాత్రమే లక్ష్య సాధన వీలవుతుందిని గ్రహించండి. ఏ విషయమైనా గోప్యంగా ఉంచండి. విదేశీయానం నిమిత్తం చేస్తున్న యత్నాలలో ఆటంకాలు తొలగిపోతాయి. సోదరీ సోదరులు మీ యత్నాలకు చేయూతనిస్తారు.
 
మీనం:- రవాణా రంగంలో వారికి పని వారితో చికాకులు తప్పవు. ఉద్యోగస్తులకు పై అధికారుల నుంచి ఒత్తిడి, చికాకులు తప్పవు. ఆహార విషయాలపై దృష్టి సారించడం అవసరం. స్త్రీలకు చుట్టు ప్రక్కలవారితో సంభాషించేటప్పుడు జాగ్రత్తగా వ్యవహరించండి. రేషన్ డీలర్లకు అధికారుల నుంచి వేధింపులు తప్పవు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

12-07-2023 బుధవారం రాశిఫలాలు - సత్యదేవుని పూజించి అర్చించినా అన్నివిధాలా శుభం...