Publish Date: Fri, 26 Oct 2018 (13:07 IST)
Updated Date: Fri, 26 Oct 2018 (14:07 IST)
వంకాయ రుచికరంగా ఉంటుంది. ఆకలిని పెంచుతుంది. సాధారణంగా కొందరికి వంకాయ అంటే అసలు పడదు. దురదలు వచ్చే ప్రమాదం ఉండదని వంకాయను అంతంగా తీసుకోరు. వంకాయ తీసుకుంటే దురదులు తగ్గుతాయే కానీ, దీని వలన ఎలాంటి ప్రమాదం ఉండదు. వంకాయలోని కలిగే ఆరోగ్య ప్రయెజనాలు తెలుసుకుంటే.. అసలు వదిలి పెట్టరు..
నీలం రంగు వంకాయలో పోషక విలువలు అధికంగా ఉంటాయి. దీనిలో విటమిన్స్, యాంటీ ఆక్సిడెంట్స్, మెగ్నిషియం, క్యాల్షియం, పొటాషియం వంటి ఖనిజాలు పుష్కలంగా ఉన్నాయి. రక్తసరఫరాను మెరుగుపరుస్తాయి. స్థూలకాయ వ్యాధితో బాధపడేవారిని వంకాయ చాలా మంచిది. ప్రతిరోజూ వంకాయలను నూనెలో కొద్దిగా ఉప్పు, కారం వేసి వేయించుకుని తీసుకుంటే బరువు తగ్గుతుంది.
అంతేకాకుండా ముత్రాపిండాల్లోని రాళ్లను కరిగిస్తుంది. వంకాయను కూరగా కాకుండా పచ్చిడిగా కూడా తీసుకోవచ్చును. ఎలా చేయాలంటే.. వంకాయలను నూనెలో బాగా వేయించి తరువాత వాటిలో పచ్చిమిర్చి, టమోటాలు, ఉప్పు, చింతపండు వేసి మరి కాసేపు వేయించుకోవాలి. ఆ తరువాత మిక్సీలో మెత్తగా రుబ్బుకోవాలి. ఇలా చేసిన మిశ్రమాన్ని వేడివేడి అన్నంలో కలిపి తీసుకుంటే చాలా రుచిగా ఉంటుంది. ఆరోగ్యానికి మంచిది.
webdunia
Publish Date: Fri, 26 Oct 2018 (13:07 IST)
Updated Date: Fri, 26 Oct 2018 (14:07 IST)