పనస తొనలను తేనెలో తడిపి తీసుకుంటే.. వీర్యవృద్ధికి?
పనస పండును తేనెలో తడిపి తీసుకుంటే వీర్యవృద్ధికి సహకరిస్తుంది. హై ఫైబర్ కలిగిన పనస పండు పైల్స్‌ను నివారిస్తుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.
Publish Date: Tue, 16 Oct 2018 (11:04 IST)
Updated Date: Tue, 16 Oct 2018 (11:05 IST)
పనస పండును తేనెలో తడిపి తీసుకుంటే వీర్యవృద్ధికి సహకరిస్తుంది. హై ఫైబర్ కలిగిన పనస పండు పైల్స్‌ను నివారిస్తుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. ఇంకా పనసలోని విటమిన్ కంటి చూపును మెరుగుపరుస్తుంది. యాంటీ ఏజింగ్ లక్షణాలను దూరం చేస్తుంది. చర్మ సౌందర్యానికి వన్నె తెస్తుంది. ఆస్తమాను తొలగించి, ఎముకలకు బలాన్నిస్తుంది. అనీమియాను దూరం చేస్తుంది.
పనస తొనలను తేనెతో కలిపి తీసుకుంటే మెదడు నరాలు బలపడతాయి. వాత, పిత్త వ్యాధులు దూరమవుతాయి. పనసలో విటమిన్ ఎ పుష్కలంగా ఉంటుంది. రక్తాన్ని వృద్ధి చేస్తుంది. అంటువ్యాధులను దూరం చేస్తాయి. పనస లేత తొనల్ని వేయించి తీసుకోవడం ద్వారా పిత్తం తొలగిపోతుంది. పనస వేరును పొడిని చర్మ సమస్యలపై రాసుకుంటే ఉపశమనం లభిస్తుంది.
ఆంటీ-యాక్సిండెంట్లు, విటమిన్ సి పుష్కలంగా ఉండే పనసను మితంగా తీసుకోవడం ద్వారా క్యాన్సర్ కారకాలను నిర్మూలించవచ్చు. మధుమేహాన్ని, గుండెపోటును నియంత్రించే పనసలో పొటాషియం పుష్కలంగా ఉంటాయని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.