Publish Date: Friday, 30 January 2026 (17:42 IST)
Updated Date: Friday, 30 January 2026 (01:44 IST)
మనం ప్రతిరోజూ వంటకాలలో చింతపండును ఉపయోగిస్తాము. దానిలోని గింజలను వేరిపారేస్తుంటాము. చింతపండు వలన మాత్రమే కాకుండా చింతగింజలతో కూడా మనకు ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. వయసు పెరగడం, అధిక బరువు వంటి కారణాల వల్ల మోకాళ్లలో కీళ్లు అరిగిపోయి మోకాలి నొప్పి కలుగుతుంది. దీనిని తగ్గించటానికి చింతగింజల పొడి అద్భుతంగా పనిచేస్తుంది.
పుచ్చులు లేని చింతగింజలను బాగా పెనుములో వేయించుకుని తర్వాత మంచి నీటిలో రెండు రోజులపాటు నానబెట్టాలి. ప్రతిరోజు రెండు పూటలా నీటిని మారుస్తుండాలి. ఇలా నానిన చింతగింజలను పొట్టు తీసేసి మెత్తగా పొడి చేసి గాజు సీసాలో నిల్వ చేసుకోవాలి. చింత గింజల పొడిని రోజుకు రెండుసార్లు అర టీ స్పూన్ చొప్పున పాలు లేదా నీటితో నెయ్యి లేదా చక్కెర కలిపి తీసుకోవాలి.
ఇలా చేస్తే రెండుమూడు నెలల్లో మంచి ఫలితం కనిపిస్తుంది. మోకాలి నొప్పి పూర్తిగా నయమవుతుంది. చింతగింజల చూర్ణం కీళ్ల నొప్పులకే కాక డయేరియా, డయాబెటిస్, గొంతులో ఇన్ఫెక్షన్లు ఇంకా దంత సమస్యలకు కూడా బాగా పనిచేస్తుంది.