Publish Date: Friday, 30 January 2026 (17:42 IST)
Updated Date: Friday, 30 January 2026 (01:44 IST)
మహిళలు ముఖ సౌందర్యానికి ఎంతో ప్రాధాన్యతనిస్తారు. వారిని బాగా ఇబ్బందిపెట్టే సమస్యల్లో మొటిమల సమస్య ఒకటి. వీటి వల్ల ముఖ సౌందర్యం పాడైపోతుంది. దీంతో పదిమందిలో తిరగాలంటేనే చాలా ఇబ్బందిగా ఉంటుంది. ఆ ఇబ్బందిని దూరం చేసుకోవాలంటే ఈ క్రింది చిట్కాలు పాటిస్తే సరిపోతుంది.
1. చందనపు పేస్ట్‌లో గులాబీ జలాన్ని (రోజ్ వాటర్) కలుపుకుని మొటిమలపై పూయండి. ఈ లేపనాన్ని కనీసం అరగంట ఉంచండి. ఆ తర్వాత చల్లటి నీటితో కడిగేయండి. ఇలా ప్రతి 15 రోజులపాటు చేయండి. ఈ 15 రోజులలో మొటిమలను దూరం చేసుకోవచ్చు.
2. పుదీనాను రుబ్బుకుని మొటిమలకు రాయండి. ఇలా 15 రోజులపాటు ప్రతి రోజూ అరగంటపాటు పూస్తే ఉపశమనం కలుగుతుంది.
3. తులసి ఆకుల రసాన్ని టమోటాల రసంలో కలుపుకుని మొటిమలకు పూస్తే ఫలితం ఉంటుంది.
4. ముఖంపై నిమ్మకాయ చెక్కతో రుద్దితే మొటిమలనుండి ఉపశమనం కలుగుతుందంటున్నారు వైద్యులు.
5. ప్రతి రోజు మీరు స్నానం చేసేటప్పుడు వేపనూనెతో తయారు చేసిన సబ్బును వాడండి లేదా నాలుగు చుక్కలు డెటాల్ కలుపుకుని స్నానం చేయండి. దీంతో ముఖంపై నున్న మొటిమలు తొలగిపోతాయి.