Publish Date: Thu, 17 Jan 2019 (13:13 IST)
Updated Date: Thu, 17 Jan 2019 (13:58 IST)
పార్టీకి వెళ్తున్నారా... మేకప్ వేసుకునేందుకు ఎక్కువ సమయం లేదా... అయితే అలాంటి సమయాల్లోను మేకప్ వేసుకునే వెసలుబాటు ఉంది. కేవలం రెండు నిమిషాల్లోపే మేకప్ వేసుకోవడం పూర్తి చేసి పార్టీకి దర్జాగా వెళ్లొచ్చు.
ఎలాగో తెలుసుకోవాలా.. ముఖంపై మచ్చలు లేదా గుంతలు లాంటివి కనపడకుండా ఫౌండేషన్ వేసుకున్న తర్వాత కాంపాక్ట్‌ను వేసుకుంటే చర్మం మెరుస్తుంది. కనురెప్పలపై బ్రష్‌ను ఉపయోగించి ఐ షాడో వేసుకోవాలి. నల్లని ఐ లైనర్ను కంటి కొసలకు ఇరువైపులా వేసుకుంటే ఆకర్షణీయంగా ఉంటుంది. ఇదంతా కేవలం అరవై సెకన్లలోపు మాటే.
మరో అరవై నిమిషాల్లోగా.. చేతి వేళ్ల సహాయంతో గులాబీ రంగు క్రీమ్‌ను బుగ్గలపై అద్దితే, బుగ్గలు కాంతి వంతంగా మెరుస్తాయి. అయితే దీనికి ముదురు రంగులు కాకుండా తేలిక పాటి రంగులను ఎంచుకుంటే మంచిది.
మేకప్‌లో ముఖ్యాంశం పెదవులు.. ముందుగా లేత గులాబీ రంగు లిప్ లైనర్ ఉపయోగించాలి. తర్వాత మీకు ఇష్టమైన రంగు లిప్‌స్టిక్‌ను లిప్‌బ్రష్‌ను ఉపయోగించడం కంటే చేతి వేళ్లు ఉపయోగిస్తే మరీ మంచిది. అంతే రెండు నిమిషాల్లోనే మేకప్ ఓవర్.. ఇక నచ్చిన డ్రెస్‌తో పార్టీకి వెళ్లిపోవచ్చు.
webdunia
Publish Date: Thu, 17 Jan 2019 (13:13 IST)
Updated Date: Thu, 17 Jan 2019 (13:58 IST)