వర్షాకాలంలో జిడ్డు వదిలించుకోవాలంటే..?
వర్షాకాలంలో ముఖంపైనే కాకుండా.. కేశాలకు పట్టిన జిడ్డు వదిలించుకోవాలంటే.. నిమ్మరసాన్ని ఉపయోగించాల్సిందే అంటున్నారు.. ఆయుర్వేద నిపుణులు. వర్షంలో తడవడంతో జుట్టు జిడ్డుగా మారితే.. తలస్నానం చేసినా జుట్టు జి
Publish Date: Fri, 13 Jul 2018 (12:43 IST)
Updated Date: Fri, 13 Jul 2018 (12:45 IST)
వర్షాకాలంలో ముఖంపైనే కాకుండా.. కేశాలకు పట్టిన జిడ్డు వదిలించుకోవాలంటే.. నిమ్మరసాన్ని ఉపయోగించాల్సిందే అంటున్నారు.. ఆయుర్వేద నిపుణులు. వర్షంలో తడవడంతో జుట్టు జిడ్డుగా మారితే.. తలస్నానం చేసినా జుట్టు జిడ్డుగా వుంటే.. రెండు కోడిగుడ్ల పచ్చసొనలో కొద్దిగా నిమ్మరసం, తేనె వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని తలకు రాయాలి. బాగా ఆరాక తలస్నానం చేయాలి. జిడ్డు వదలడమే కాదు, కేశాలు కూడా మెరిసిపోతాయి.
అలాగే ఆలివ్‌నూనె, తేనెను తీసుకుని కాస్త గోరువెచ్చగా చేసి తలమాడుకు జుట్టుకు పట్టించాలి. ఇరవై నిమిషాల తరువాత గాఢత తక్కువగా ఉన్న షాంపూతో కడిగేయాలి. ఇలా వారానికోసారి చేస్తుంటే జుట్టు ఆరోగ్యంగా మారుతుంది. ఇంకా ముఖానికి ఆలివ్ నూనె, తేనె మిశ్రమాన్ని ప్యాక్‌లా వేసుకుంటే ముఖంపైనున్న జుడ్డు తొలగిపోతుంది.
జుట్టు చివర్ల చిట్లిన సమస్య వుంటే.. అరకప్పు పెరుగులో పావుకప్పు బొప్పాయి గుజ్జు కలిపి తలంతా పూతలా పట్టించాలి. అరగంటాగి గోరువెచ్చని నీటితో కడిగేస్తే చాలు. అదేవిధంగా కలబంద గుజ్జులో పెద్ద చెంచాడు నిమ్మరసం, రెండు పెద్ద చెంచాల ఆముదం కలిపి తలంతా రాసి బాగా మర్దనా చేయాలి. ఇలా వారానికి రెండుసార్లు చేస్తుంటే చివర్లు చిట్లడటం తగ్గుతుంది. ఇదే మిశ్రమాన్ని ముఖానికి పట్టించినా చర్మ సౌందర్యం మెరుగవుతుందని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు.
Selvi
Publish Date: Fri, 13 Jul 2018 (12:43 IST)
Updated Date: Fri, 13 Jul 2018 (12:45 IST)