Publish Date: Wed, 24 Mar 2021 (11:10 IST)
Updated Date: Wed, 24 Mar 2021 (11:11 IST)
నిన్న మొన్నటి వరకు ఆకాశమే హద్దుగా పెరిగిన బంగారం ధరలు గత నాలుగు రోజులుగా నేలచూపులు చూస్తున్నాయి. గ్లోబల్ క్యూస్ మధ్య నేడు బంగారం ధరలు బలహీనంగా ట్రేడ్ అయ్యాయి. ఎంసీఎక్స్ గోల్డ్ ఏప్రిల్ ప్యూచర్స్‌లో రూ. 107 (0.24 శాతం) తగ్గి రూ. 44,798 వద్ద ట్రేడ్ అవుతోంది.
అంతకుముందు ఇది రూ. 44,905 వద్ద ముగిసింది. ఎంసీఎక్స్‌లో వెండి మే ఫ్యూచర్స్ కిలోకు రూ.306 (0.46 శాతం) తగ్గి రూ.66,025కు క్షీణించింది. అంతకుముందు ఇది రూ.66,331 వద్ద క్లోజ్ అయింది.
గతేడాది ఆగస్టులో పసిడి ధర రికార్డు స్థాయిలో పది గ్రాములకు రూ.56,191కు చేరుకుని సామాన్యుల గుండెలు అదిరిపోయేలా చేసింది. అయితే, ఆ తర్వాతి నుంచి క్రమంగా తగ్గుతూ వచ్చింది. ఇప్పటి వరకు పది గ్రాముల పుత్తడి ధరపై ఏకంగా రూ.11,393 (20.27 శాతం) తగ్గింది.