Publish Date: Mon, 02 Nov 2020 (17:46 IST)
Updated Date: Mon, 02 Nov 2020 (17:49 IST)
ఆంధ్రప్రదేశ్‌లో కొత్తగా 1,916 కరోనా కేసులు నమోదయ్యాయి. 64,581 నమూనాలను పరీక్షించగా తాజా కేసులు నిర్ధారణ అయినట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించింది. దీంతో రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య 8,27,882కి చేరింది. ఈ మేరకు ప్రభుత్వం బులెటిన్ విడుదల చేసింది. 24 గంటల వ్యవధిలో 13 మంది కరోనాతో చికిత్స పొందుతూ మృతి చెందారు.
అనంతపురం జిల్లాలో 3, కృష్ణా 3, చిత్తూరు, తూర్పుగోదావరి, గుంటూరు, కడప, ప్రకాశం, శ్రీకాకుళం, పశ్చిమగోదావరి జిల్లాల్లో ఒకరు చొప్పున మరణించారు. దీంతో రాష్ట్రంలో ఇప్పటివరకు కరోనాతో మృతిచెందిన వారి సంఖ్య 6,719కి చేరింది. ఒక్కరోజు వ్యవధిలో 3,033 మంది కొవిడ్ నుంచి పూర్తిగా కోలుకోగా.. 22,538 యాక్టివ్ కేసులున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు 81,82,266 నమూనాలను పరీక్షించినట్లు ప్రభుత్వం బులెటిన్‌లో పేర్కొంది.