Publish Date: Tue, 22 Dec 2020 (10:00 IST)
Updated Date: Tue, 22 Dec 2020 (10:57 IST)
తెలంగాణ రాష్ట్రంలో సోమవారం రాత్రి 8గంటల వరకు 45,227 కరోనా నిర్థారణ పరీక్షలు నిర్వహించగా 617 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం ఇప్పటి వరకు నమోదైన కేసుల సంఖ్య 2,82,347కి చేరింది. ఈమేరకు వైద్య ఆరోగ్యశాఖ మంగళవారం ఉదయం బులిటెన్ విడుదల చేసింది.
సోమవారం కరోనాతో ముగ్గురు మృతి చెందారు. దీంతో మృతుల సంఖ్య 1,518కి చేరింది. కరోనాబారి నుంచి నిన్న 635 మంది కోలుకున్నారు. దీంతో ఇప్పటివరకు కోలుకున్న బాధితుల సంఖ్య 2,74,260కి చేరింది.
రాష్ట్రంలో ప్రస్తుతం 6,569 యాక్టివ్ కేసులు ఉన్నాయని, వారిలో 4,400 మంది హోం ఐసోలేషన్‌లో చికిత్స పొందుతున్నారని వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది. తెలంగాణలో ఇప్పటి వరకు నిర్వహించిన కరోనా పరీక్షల సంఖ్య 65,20,993కి చేరింది.