Publish Date: Friday, 30 January 2026 (17:42 IST)
Updated Date: Friday, 30 January 2026 (01:44 IST)
దేశంలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 36,401 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయని కేంద్ర కుటుంబ ఆరోగ్యమంత్రిత్వ శాఖ వెల్లడించింది. అలాగే, 39,157 మంది బాధితులు కోలుకున్నారు. 24 గంటల్లో 530 మంది బాధితులు మహమ్మారి బారినపడి మృత్యువాతపడ్డారు.
తాజాగా నమోదైన కేసులతో దేశంలో మొత్తం కేసుల సంఖ్య 3,23,22,258కు పెరిగింది. ఇందులో 3,15,25,800 మంది కోలుకున్నారు. ప్రస్తుతం 3,64,129 ఉన్నాయని చెప్పింది. వైరస్ బారినపడి ఇప్పటివరకు 4,33,049 మంది కన్నుమూశారు.
మరోవైపు దేశంలో కొవిడ్ పరీక్షలు 50కోట్ల మార్క్‌ను దాటాయి. బుధవారం దేశవ్యాప్తంగా 18,73,757 కొవిడ్ శాంపిల్స్ పరీక్షించగా.. ఇప్పటివరకు 50,03,00,840 నమూనాలను పరిశీలించినట్లు ఇండియన్ కౌన్సిల్ ఫర్ మెడికల్ రీసెర్చ్ (ఐసీఎంఆర్) వివరించింది.