భారత మాజీ ఫాస్ట్ బౌలర్ జహీర్ ఖాన్ తండ్రి అయ్యాడు. జహీర్ ఖాన్ సతీమణి సాగరిక ఘాట్గే పండంటి మగబిడ్డకు జన్మనిచ్చారు. ఈ జంట సోషల్ మీడియా ద్వారా ఈ వార్తను ధ్రువీకరించారు. తమ కొడుకుకు ఫతేసింగ్ ఖాన్ అని పేరు పెట్టినట్లు ప్రకటించారు.
"ప్రేమ, కృతజ్ఞత, దేవతల ఆశీర్వాదాలతో, మేము మా చిన్న పిల్లవాడు ఫతేసింగ్ ఖాన్‌ను స్వాగతిస్తున్నాము" అని సాగరిక ఘాట్గే తన పోస్ట్‌లో రాశారు.
ఈ సందర్భాన్ని గుర్తుచేసుకోవడానికి, ఈ జంట ఒక అందమైన ఫ్యామిలీ ఫోటోగ్రాఫ్‌ను కూడా పంచుకున్నారు. చిత్రంలో, జహీర్ ఖాన్ తన చేతుల్లో బిడ్డను పట్టుకుని కనిపిస్తుండగా, సాగరిక ఘాట్గే జహీర్ భుజాల చుట్టూ తన చేతులను మెల్లగా చుట్టింది.
ఈ జంట తమ మొదటి బిడ్డను స్వాగతించినప్పుడు, వివిధ రంగాలలోని ప్రముఖుల నుండి అభినందనలు వెల్లువెత్తాయి. ఈ జంట 2017లో వివాహం చేసుకున్నారు.