స్వదేశంలో ఐపీఎల్ 2025 సీజన్ పోటీలు రసవత్తరంగా సాగుతున్నాయి. ఈ పోటీల్లో భాగంగా, మంగళవారం రాత్రి పంజాబ్ కింగ్స్, కోల్‌కతా నైట్ రైడర్స్ జట్ల మధ్య కీలక మ్యాచ్ జరిగింది. ఇందులో కేకేఆర్ జట్టు ఫాస్ట్ బౌలర్ హర్షిత్ రాణా ఓ అరుదైన ఘనతను సాధించాడు. ఇప్పటివరకు ఏ భారతీయ ఆటగాడు సాధించని అరుదైన రికార్డును తన పేరుపై లిఖించుకున్నాడు. హర్షిత్ తన అద్భుతమైన బౌలింగ్‌తో పంజాబ్ వెన్ను విరిచాడు. పంజాబ్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో పవర్ ప్లేలో హర్షిత్ రాణా 3 వికెట్లు తీశాడు. దీనికి ముందు పవర్ ప్లేలో ఏ ఒక్క భారతీయ బౌలర్ కూడా మూడు లేదా అంతకంటే ఎక్కువ వికెట్లు తీసిన ఘనత లేదు. హర్షిత్ రాణా బౌలింగ్ కారణంగా కేకేఆర్ జట్టు పంజాబ్ కింగ్స్‌ను 15.3 ఓవర్లలో 111 పరుగులకే పరిమితం చేశింది. ఈ సీజన్‌లో పంజాబ్ కింగ్స్‌కు అదే అత్యల్ప స్కోరు.
పంజాబ్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో హర్షిత్ రాణా పవర్ ప్లేలో మూడు వికెట్లు తీసి భారీ స్కోరు సాధించకుండా నిరోధించాడు. నాలుగో ఓవర్లోనే పంజాబ్ కింగ్స్ తొలి వికెట్ కోల్పోయింది. ఆ ఓవర్‌లోని రెండో బంతికి హర్షిత్ రాణా ఒక షార్ట్ బాల్ వేశాడు. ప్రియాంష్ ఆర్య దానిని ఫ్లిక్ చేశాడు. కానీ బంతి స్క్వేర్ లెగ్ వైపు వెళ్లింది. బౌండరీ వద్ద రమణ్ దీవ్ సింగ్ సులభమైన క్యాచ్ తీసుకున్నాడు. ప్రియాంష్ 12 బంతుల్లో 22 పరుగులు చేశాడు. నాలుగో ఓవర్లలోనే పీబీకేఎస్ రెండో వికెట్ కూడా కోల్పోయింది.
ఓ ఓవర్‌లోని నాలుగో బంతికి కేకేఆర్ ఫాస్ట్ బౌలర్ హర్షిత్ రాణా ఆఫ్ స్టంఫ్ వెలుపల షార్ట్ పిచ్ వేశాడు. పంజాబ్ కింగ్స్ కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ కట్ షాట్ ఆడాడు. కానీ, రమణ దీప్ సింగ్ డీప్ బ్యాక్ వర్డ్ పాయింట్ వద్ద అద్భుతంగా డైవ్ చేసి క్యాచ్ పట్టాడు. శ్రేయాస్ కూడా ఖాతా తెరవలేక పోయాడు. పవర్ ప్లేలో హర్షిత్ రాణా పంజాబ్‌కు నాలుగో దెబ్బ తీశాడు. పవర్ ప్లే చివరి బంతికి హర్షిత్ ఆఫ్ స్టంప్ వెలుపల షార్ట్ అండ్ గుడ్ లెంగ్త్ బాల్ సంధించాడు. ప్రభ్ సిమ్రాన్ కట్ షాట్ ఆడాడు. కానీ పాయింట్ వద్ద రమణ్ దీప్ సింగ్ చేతిరి చిక్కాడు. మొత్తంగా పవర్ ప్లేలో హర్షిత్ రాణా మూడు వికెట్లు తీశాడు.