Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

రాంగ్ ఫోన్ కాల్ వాజేడు ఎస్ఐ హరీశ్ ప్రాణం తీసింది.. : యువతి అరెస్టు

Advertiesment
arrest

ఠాగూర్

, ఆదివారం, 15 డిశెంబరు 2024 (10:26 IST)
తెలంగాణ రాష్ట్రంలోని ములుగు జిల్లా వాజేడు ఎస్ఐ రుద్రారపు హరీశ్ ఆత్మహత్య కేసులో ఓ యువతిని పోలీసులు అరెస్టు చేశారు. హరీశ్ హత్యకు ఈ యువతే ప్రధాన కారణమని పోలీసులు ఓ నిర్ధారణకు వచ్చిన ఆమెను అదుపులోకి తీసుకున్నారు. హరీశ్ బలవన్మరణానికి ఆమె వేధింపులే కారణంగా భావించి, కొన్ని రోజులుగా ఆమె కోసం గాలిస్తున్నారు. తనను పెళ్లి చేసుకోవాలని, లేదంటే చచ్చిపోవాలంటూ ఆమె చేసిన వేధింపులే ఎస్ఐ త్మహత్యకు కారణంగా పోలీసులు తేల్చారు.
 
హరీశ్ ఈ నెల 2న వాజేడు మండలం ముల్లెకట్ట వారధి సమీపంలోని ఓ రిసార్టులో తన సర్వీసు రివాల్వర్‌‍తో కాల్చుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. కేసు విచారణలో పలు విషయాలు వెలుగులోకి వచ్చాయి. సూర్యాపేట జిల్లా చిలుకూరు మండలం దుదియతండాకు చెందిన బానోతు అనసూర్య అలియాస్ అనూష ఓ కాలేజీలో స్టాఫ్ అడ్మిన్‌గా పనిచేస్తోంది.
 
ఈ క్రమంలో ఏడు నెలల క్రితం ఓ రాంగ్ కాల్ ద్వారా ఎస్ఐ పరిచయమయ్యారు. ఆ తర్వాత అది స్నేహంగా మారింది. ఆయనను పెళ్లి చేసుకుంటే జీవితంలో స్థిరపడవచ్చని భావించి హరీశ్‌‍కు తరచూ ఫోన్ చేస్తూ మరింత దగ్గరైంది. పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి చేయసాగింది.
 
ఆయన అందుకు నిరాకరించడంతో తనను శారీరకంగా ఉపయోగించుకుని, ఇప్పుడు పెళ్లికి తిరస్కరిస్తున్నావని ఉన్నతాధికారులకు, మీడియాకు చెబుతానంటూ బెదిరించింది. తనను పెళ్లి చేసుకోకుంటే చచ్చిపోవాలంటూ ఇబ్బందులకు గురిచేయడంతో మనస్తాపానికి గురైన హరీశ్ ఆత్మహత్య చేసుకున్నారు. అనూషను అరెస్టు చేసిన పోలీసులు రిమాండుకు తరలించారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కంప్యూటర్‌ ఆపరేటర్‌గా పని చేయడం ఇష్టంలేక.. చేతి వేళ్లను నరుక్కున్నాడు..