Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఈ 'కథానాయకుడు' ఆ 'యాత్ర'.... ఏపీ ఎన్నికల్లో లబ్ది కోసమేనా?

Advertiesment
Yatra
, గురువారం, 13 డిశెంబరు 2018 (17:12 IST)
మహానటి... సావిత్ర జీవిత గాధ ఆధారంగా తెరకెక్కిన చిత్రం. ఈ చిత్రంలో మహానటి సావిత్రి పాత్రలో కీర్తి సురేష్ నటించారు. ఆనాటి నటి సావిత్రి గురించి ఈ చిత్రం ద్వారా దర్శకుడు చక్కగా చెప్పాడు. ప్రేక్షకులు కూడా బ్రహ్మరథం పట్టారు. ఇలాంటి బయోపిక్ చిత్రాలు బాలీవుడ్ ఇండస్ట్రీలోనూ వచ్చాయి. ఇక ఇప్పుడు వచ్చే ఏడాది ప్రధమార్థంలో ఇద్దరు నాయకులకు సంబంధించి బయోపిక్ చిత్రాలు విడుదల కాబోతున్నాయి.
 
ఒకటి తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు స్వర్గీయ ఎన్టీఆర్ జీవితం ఆధారంగా తెరకెక్కిస్తున్న కథానాయకుడు చిత్రం. ఈ చిత్రాన్ని రెండు భాగాలుగా తీస్తున్నారు. ఇందులో ఎన్టీఆర్ పాత్రలో ఆయన తనయుడు, నట సింహం బాలయ్య నటిస్తున్నాడు. మరోవైపు రెండో చిత్రం కాంగ్రెస్ పార్టీకి చెందిన దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్ బయోపిక్ యాత్ర. ఈ చిత్రంలో ప్రముఖంగా వైఎస్సార్ చేసిన సుదీర్ఘ పాదయాత్రను, అనంతరం ఆయన అధికారం చేపట్టడాన్ని చూపించనున్నారని వినిపిస్తోంది.
Yatra
 
ఇదిలావుంటే వచ్చే ఏడాది ఏప్రిల్ నెలలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో శాసన సభ ఎన్నికలు జరుగనున్నాయి. ఈ నేపధ్యంలో ఎన్నికలకు ముందు ఈ రెండు చిత్రాలు విడుదల కాబోతున్నాయి. యాత్ర చిత్రం ద్వారా జగన్ మోహన్ రెడ్డికి ఎన్టీఆర్ కథానాయకుడు ద్వారా చంద్రబాబు నాయుడికి లబ్ది చేకూరుతుందనే వాదనలు వినిపిస్తున్నాయి. మరి నిజంగానే ఈ చిత్రాలు ఆ నాయకులకు అంతగా ఉపయోగపడుతాయో లేదంటే మహానటిలా కలెక్షన్ల వరకే పరిమితమవుతాయో చూద్దాం.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

మూడోసారి కూడా ఆడబిడ్డ.. భర్త ముఖం చాటేశాడు.. అమ్మేయాలనుకుంది