Publish Date: Wed, 26 Jun 2019 (11:34 IST)
Updated Date: Wed, 26 Jun 2019 (11:35 IST)
టీపై మక్కువ ఉన్నవాళ్లు లెమన్ టీ, గ్రీన్ టీ, జింజర్ టీ అంటూ చాలా రకాల టీలు త్రాగుతుంటారు. అలాంటి వారు ఎప్పుడైనా యాపిల్ టీ గురించి విన్నారా? ఈ టీ ఇప్పటికే యూరప్‌లో ఎంతో ప్రజాదరణ పొందింది. రోజూ ఒక యాపిల్ తింటే ఆరోగ్యంగా ఉండవచ్చని మనకు తెలుసు. యాపిల్ టీని త్రాగడం వలన కూడా చాలా ప్రయోజనాలు ఉన్నాయని చెబుతున్నారు న్యూట్రీషియనిస్టులు.
ఈ టీ చాలా రుచిగా ఉండటంతోపాటు శరీరం ఫిట్‌గా ఉండేందుకు దోహదపడుతుంది. రోగనిరోధక వ్యవస్థను పెంపొందిస్తుంది. ఇన్ఫెక్షన్లను నివారించడంలో కీలక పాత్ర పోషిస్తుంది. ఉదర సంబంధ సమస్యలకు యాపిల్ టీ చక్కటి ఔషధం.
యాపిల్ టీ రోజూ తీసుకుంటే సౌందర్యం పెరుగుతుంది. చర్మం కాంతివంతంగా ఉంటుంది. జాయింట్ పెయిన్ సమస్యలను నివారిస్తుంది. శరీర బరువు నియంత్రణలో ఉంటుంది. దీనిని తయారు చేయడం కూడా చాలా సులభం. పాత్రలో కొద్దిగా నీటిని తీసుకుని మరిగించాలి.
మరుగుతున్న నీటిలో శుభ్రపరిచిన యాపిల్ని చిన్న చిన్న ముక్కలుగా చేసి వేసి బాగా ఉడికించాలి. ఆ తర్వాత తగినంత టీ పొడి, లవంగ దాల్చిన చెక్కపొడి వేసి కాసేపు మరిగించాలి. తర్వాత దించి వడపోసి కొద్దిగా తేనె కలుపుకుని త్రాగాలి. ప్రతి రోజూ ఏదో ఒక సమయంలో యాపిల్ టీని త్రాగటం వలన సౌందర్యంతో పాటు ఆరోగ్యం మీ సొంతం అవుతుంది.
సందీప్
Publish Date: Wed, 26 Jun 2019 (11:34 IST)
Updated Date: Wed, 26 Jun 2019 (11:35 IST)