Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

నెయ్యితో మేలే.. అలసిపోయే వారికి సూపర్ టానిక్

Advertiesment
Ghee
రోజంతా నిరుత్సాహంగా, నిస్స‌త్తువ‌తో మహిళలు ఉద‌యాన్నే అల్పాహారంతో నెయ్యి తినాలి. దీంతో మెద‌డు యాక్టివ్‌గా మారుతుంది. ఉత్సాహంగా ఉంటారు. ఎల్ల‌ప్పుడూ శ‌క్తి ల‌భిస్తుంది. ఏ ప‌ని ఎంత సేపు చేసినా అల‌సిపోకుండా ఉంటారు. నెయ్యిని తిన‌డం వ‌ల్ల మ‌న శరీరానికి ఎల్ల‌ప్పుడూ శ‌క్తి ల‌భిస్తుంది.
 
ఆర్థ‌రైటిస్ స‌మ‌స్య ఉన్న‌వారు నిత్యం నెయ్యి తింటే ఆ నొప్పుల నుంచి బ‌య‌ట ప‌డ‌వ‌చ్చు. పిల్ల‌ల‌కు రోజూ నెయ్యి తినిపించ‌డం వ‌ల్ల వారిలో ఎదుగుద‌ల స‌రిగ్గా ఉంటుంది. చ‌దువుల్లో వారు రాణిస్తారు.
 
నిత్యం ఉద‌యాన్నే ప‌ర‌గ‌డుపునే 1 లేదా 2 టేబుల్ స్పూన్ల నెయ్యి తిన‌డం అల‌వాటు చేసుకుంటే శ‌రీరంలో ఉన్న కొవ్వు క్ర‌మంగా క‌రుగుతుంది. ఆక‌లి బాగా పెరుగుతుంది. థైరాయిడ్ స‌మ‌స్యలు ఉన్న‌వారు ఇలా నెయ్యిని తింటే ఫ‌లితం ఉంటుంది.
 
నెయ్యిలో ఒమెగా 3, ఒమెగా 6 ఫ్యాటీ యాసిడ్లు పుష్క‌లంగా ఉంటాయి. ఇవి శ‌రీరంలో ఉన్న కొవ్వును క‌రిగించ‌డంలో ముఖ్య పాత్ర పోషిస్తాయి. అందువ‌ల్ల నెయ్యి తింటే బ‌రువు త‌గ్గుతారు త‌ప్ప పెర‌గ‌రు. అలాగే గుండె జ‌బ్బులు కూడా రాకుండా ఉంటాయి. జీర్ణ స‌మ‌స్య‌లు ఉన్న‌వారు కూడా నెయ్యి తినాలని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఇన్ఫెక్షన్లకు చెక్ పెట్టే ముల్లంగి.. కొలెస్ట్రాల్ ఇట్టే తగ్గిపోతుంది తెలుసా?