Publish Date: Mon, 22 Jan 2024 (23:49 IST)
Updated Date: Mon, 22 Jan 2024 (23:51 IST)
చలి వాతావరణంతో జలుబు, జ్వరం, దగ్గు, ఫ్లూ తదితర సీజనల్ వ్యాధులు వెంటాడుతాయి. వీటి బారి నుంచి తప్పించుకునేందుకు ఎలాంటి జాగ్రత్తలు, చిట్కాలు పాటించాలో తెలుసుకుందాము. వెల్లుల్లి బ్యాక్టీరియా పెరుగుదలను నిరోధిస్తే, మిరపకాయ సైనస్ రద్దీని తగ్గిస్తుంది. విటమిన్-సి అధికంగా ఉండే పండ్లు, కూరగాయలను తీసుకోవాలి.
ఆహారంలో పుట్టగొడుగులు, నిమ్మ, తేనెను చేర్చాలి. జింక్ అధికంగా ఉండే ఆహారాన్ని తీసుకోవాలి.
రెడ్ మీట్, గుడ్లు, పెరుగు, తృణధాన్యాలు తీసుకోవాలి. నాన్ వెజిటేరియన్ అయితే చికెన్ సూప్ తీసుకుంటే, ఇది కఫాన్ని వదలగొడుతుంది.
రోజూ రాత్రి పడుకునే ముందు పసుపు పాలు తాగాలి. తీవ్రమైన ఇన్ఫెక్షన్ విషయంలో, ముక్కు దిబ్బడగా వున్నప్పుడు ఆవిరిని పీల్చుకోండి. రోజంతా గోరువెచ్చని నీరు త్రాగాలి, గొంతు నొప్పిగా వుంటే నీటిని పుక్కిలించండి.
సిహెచ్
Publish Date: Mon, 22 Jan 2024 (23:49 IST)
Updated Date: Mon, 22 Jan 2024 (23:51 IST)