ప్రతిరోజూ తోటకూరను తీసుకుంటే?
ఆకుకూరల్లో తోటకూర 'రాణి' వంటిదని అంటారు. దీనిలో పెరుగు తోటకూర, ఎర్ర తోటకూర, చిలక తోటకూర వంటి పలురకాలున్నాయి. తోటకూరలోని విటమిన్ సి రోగనిరోధక శక్తిని పెంచుతుంది. ఇందులో క్యాల్షియం, ఇనుము, మెగ్నీషియం, ప
Publish Date: Thu, 05 Jul 2018 (11:22 IST)
Updated Date: Thu, 05 Jul 2018 (19:37 IST)
ఆకుకూరల్లో తోటకూర 'రాణి' వంటిదని అంటారు. దీనిలో పెరుగు తోటకూర, ఎర్ర తోటకూర, చిలక తోటకూర వంటి పలురకాలున్నాయి. తోటకూరలోని విటమిన్ సి రోగనిరోధక శక్తిని పెంచుతుంది. ఇందులో క్యాల్షియం, ఇనుము, మెగ్నీషియం, పాస్పరస్, జింక్, కాపర్, మాంగనీస్, సెలీనియం వంటి ఖనిజాలు చాలా లభిస్తాయి. రక్తనాళాల్ని చురుగ్గా ఉంచి గుండెకు మేలు చేసే సోడియం, పొటాషియం వంటివి కూడా సమకూరుతాయి.
ప్రతిరోజు కనీసం 200 గ్రాముల తోటకూరను తీసుకుంటే ఆరోగ్యానికి మంచిదని ఆయుర్వేద వైద్యులు చెబుతుంటారు. రెగ్యులర్‌గా తోటకూరను తీసుకుంటే రక్తహీనత నుండి విముక్తి చెందవచ్చును. బరువు తగ్గాలనుకునేవాళ్లు రెగ్యులర్‌గా తోటకూర తినడం ఉత్తమం. ఇందులోని పీచుపదార్థం జీర్ణశక్తిని పెంచుతుంది. శరీరంలోని కొవ్వును తగ్గించేందుకు చాలా ఉపయోగపడుతుంది.
తోటకూరలో ప్రోటీన్స్ ఎక్కువగా ఉంటాయి. మెులల వ్యాధికి ఈ తోటకూర మంచి ఔషధంగా పనిచేస్తుంది. తోటకూరలో విటమిన్ ఎ, సి, డి, ఇ, కె, బి12, బి6 వంటివి ఎక్కువగా లభిస్తాయి. ఇది క్యాలరీల శక్తిని పెంచుటలో చాలా సహాయపడుతుంది.
About Writer
Kowsalya
దేవీ (మురళీకృష్ణ)
నిక్‌నేమ్- శక్తిమాన్
సినిమా రంగంలో దాదాపు 26 ఏళ్ల అనుభవం ఉంది. కళారంగంపై ఇంట్రెస్టుతో రిపోర్టర్‌గా కెరీర్ మొదలైంది. అలా చేస్తూనే విజయవాడలో రంగస్థలంపై నాటకాల్లో పాత్రలు పోషించారు. అలా ఆర్టిస్టుగా.. పలు సినిమాలు, సీరియల్స్‌లో సైతం నటించారు. స్క్రిప్ట్ వర్క్‌లో కూడా కొద్దికాలం చేశారు. అలా ప్రజాశక్తి దినపత్రికలో సినిమా పేజీ న్యూస్ రిపోర్టర్‌గా తనతోనే ఆరంభం అయింది. అలా చేస్తుండగానే మెగాస్టార్ చిరంజీవి గారితో ఇంటర్వ్యూ చేశాక......
Read More