Publish Date: Friday, 30 January 2026 (17:42 IST)
Updated Date: Friday, 30 January 2026 (01:44 IST)
పుదీనా ఆకులు, నూనె, విత్తనాలు, ఇతర భాగాలు అనేక రకాల వ్యాధులకు నివారిణిగా పనిచేస్తాయి. ఆయుర్వేద వైద్య సలహాను అనుసరించి మాత్రమే పుదీనాను ఆయా వ్యాధుల నివారణకై ఉపయోగించాలి.
తలనొప్పి తగ్గేందుకు పుదీనా ఆకులు ముద్దగా చేసి నుదిటిపై వేయాలి. ఆకులు నలిపి వాసన చూడాలి. జుట్టు ఊడటం, పేలు పోయేందుకు పుదీనా ఆకులు పేస్ట్‌ను రాత్రి తలకు పట్టించాలి. పొద్దుటే స్నానం చెయ్యాలి.
దగ్గు జలుబు తగ్గాలంటే పుదీనా కషాయం రోజు 2 సార్లు తాగాలి. గొంతునొప్పి తగ్గేందుకు పుదీనా కషాయంలో ఉప్పు కలిపి పుక్కిలించాలి. ఎండిన ఆకుల పొడుముతో పళ్లు తోముకోవాలి.
పుదీనాతో చేసిన మెంథాల్ దంత వ్యాధులపై మంచి ప్రభావం చూపిస్తుంది. ప్రతి రోజు ఆకులు బాగా ఎక్కువసేపు నమిలి తినాలి. పిప్పరమెంట్ నూనెతో లవంగ నూనె కలపాలి. ఆ మిశ్రమంలో దూదిని తడిపి పెడితే పిప్పి పళ్ళు నొప్పి నుండి ఉపశమనం కలుగుతుంది.
పుదీనా నూనె మొటిమల పైన రాసినట్లయితే అవి తగ్గిపోతాయి. స్వరపేటిక ఆరోగ్యానికి పుదీనా రసం తాగాలి.