గర్భిణీ మహిళలు కరివేపాకు పొడిని అన్నంలో వేసుకుని తింటే?
కరివేపాకు ద్వారా కాల్షియం, ఫాస్ఫరస్, ఐరన్, యాంటీ ఆక్సిడెంట్, విటమిన్ బీ, కెరోటిన్ వంటి పోషకాలతో పాటూ, ప్రోటీన్, ఫైబర్, కెలోరీలు లభిస్తాయి. కరివేపాకులో ఉన్న ఔషధ గుణాలు ఆరోగ్యానికి చాలా ఉపయోగపడుతాయి.
Publish Date: Sat, 12 May 2018 (15:39 IST)
Updated Date: Sat, 12 May 2018 (16:01 IST)
కరివేపాకు ద్వారా కాల్షియం, ఫాస్ఫరస్, ఐరన్, యాంటీ ఆక్సిడెంట్, విటమిన్ బీ, కెరోటిన్ వంటి పోషకాలతో పాటూ, ప్రోటీన్, ఫైబర్, కెలోరీలు లభిస్తాయి. కరివేపాకులో ఉన్న ఔషధ గుణాలు ఆరోగ్యానికి చాలా ఉపయోగపడుతాయి.
భారతీయ వంటకాల్లో కరివేపాకు వాడటం ఎక్కువే. అయితే ప్రస్తుతం కరివేపాకు వాడకం తగ్గుతోందని సర్వేలో తేలింది. అయితే ప్రస్తుతం ఆసియా దేశాల్లో కరివేపాకు వాడకం పెరిగిపోతుంది. ఇందుకు కారణం కరివేపాకులో ఉన్న ఆరోగ్య ప్రయోజనాలు. కరివేపాకును తినడం ద్వారా కేశాలు మృదువుగా తయారవుతాయి. చిన్న వయస్సులోనే జుట్టు తెల్లబడటం పోవడాన్ని నివారిస్తుంది.
మహిళలు గర్భంగా ఉన్నపుడు కరివేపాకు పొడిని అన్నంలో గానీ, నిమ్మరసం లేదా జ్యూస్‌లో గానీ అర స్పూన్ వేసుకుని తాగితే వేవిళ్లను నిరోధించుకోవచ్చు. కరివేపాకు ఆకులకు జీర్ణ సమస్యలను తగ్గించే గుణాలున్నాయి. కరివేపాకు ఆకులో జీలకర్రను కలిపి, బాగా దంచాలి ఆ తరువాత ఆ మిశ్రమాన్ని రోజు తాగే పాలలో కలుపుకొని తాగటం వలన అజీర్ణం నుండి ఉపశమనం పొందుతారు.
About Writer
Kowsalya
దేవీ (మురళీకృష్ణ)
నిక్‌నేమ్- శక్తిమాన్
సినిమా రంగంలో దాదాపు 26 ఏళ్ల అనుభవం ఉంది. కళారంగంపై ఇంట్రెస్టుతో రిపోర్టర్‌గా కెరీర్ మొదలైంది. అలా చేస్తూనే విజయవాడలో రంగస్థలంపై నాటకాల్లో పాత్రలు పోషించారు. అలా ఆర్టిస్టుగా.. పలు సినిమాలు, సీరియల్స్‌లో సైతం నటించారు. స్క్రిప్ట్ వర్క్‌లో కూడా కొద్దికాలం చేశారు. అలా ప్రజాశక్తి దినపత్రికలో సినిమా పేజీ న్యూస్ రిపోర్టర్‌గా తనతోనే ఆరంభం అయింది. అలా చేస్తుండగానే మెగాస్టార్ చిరంజీవి గారితో ఇంటర్వ్యూ చేశాక......
Read More