Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

అమేజాన్ ఆదివాసీలకు కూడా కరోనా.. ఏడుగురికి పాజిటివ్

Advertiesment
Amazon
అమేజాన్ అటవీ ప్రాంతంలో నివసించే ఆదివాసీలకు కూడా కరోనా కేసులు బయటపడ్డాయి. దీంతో బ్రెజిల్ ఆందోళన వ్యక్తం చేస్తోంది. యానోమామి అనే తెగకు చెందిన ఈ ఆదివాసీల్లో ఏడుగురికి కరోనా కేసులు కన్ఫామ్ అయినట్లు బ్రెజిల్ ఆరోగ్య శాఖ మంత్రి లూయిజ్ హెన్రిక్ మాండెట్టా వెల్లడించారు.

బ్రెజిల్ అటవీ ప్రాంతాల్లో 300కి పైగా వివిధ తెగలకు చెందిన 18 లక్షల మంది నివసిస్తున్నారు. నాగరిక సమాజానికి దూరంగా ఉంటున్న ఈ తెగల్లో యానోమామికి చెందిన 27 వేల మంది ఉన్నట్టు అంచనా వేస్తున్నారు. 
 
బయటి ప్రపంచంతో ఎలాంటి సంబంధం లేని ఈ తెగకు కరోనా సోకడం ఆశ్చర్యంగా వుందని లూయిజ్ హెన్రిక్ అన్నారు. వీరికే ఈ మహమ్మారి సోకిందంటే మనం మరింత అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఏర్పడిందని లూయజ్ వెల్లడించారు. 
 
యానోమామి తెగకు చెందిన 15 ఏళ్ళ కుర్రాడికి ఈ వైరస్ సోకగా ఆసుపత్రిలో ఐసీయులో ఉంచి చికిత్స అందిస్తున్నట్టు చెప్పుకొచ్చారు. మొదట వారం రోజుల క్రితం 'కోకామా' తెగకు చెందిన 20ఏళ్ళ మహిళకు కరోనా సోకింది. బ్రెజిల్‌లో కూడా రోజురోజుకీ కరోనా మృతుల సంఖ్య పెరుగుతోంది.  

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఒరిస్సాలో లాక్‌డౌన్ పొడగింపు... తొలి రాష్ట్రం ఇదే...