Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

జపాన్‌లో భారీ భూకంపం... రిక్టర్ స్కేలుపై 7.4 తీవ్రత... సునామీ హెచ్చరికలు

జపాన్‌లో భారీ భూకంపం సంభవించింది. ఇది రిక్టర్ స్కేలుపై 7.4గా నమోదైంది. ఈ భూకంపం ప్రభావం కారణంగా సునామీ రావొచ్చంటూ శాస్త్రవేత్తలు తొలుత ప్రకటించినప్పటికీ.. ఆ తర్వాత వాటిని ఉపసంహరించుకున్నారు. అయితే, ము

Advertiesment
Japan earthquake
, మంగళవారం, 22 నవంబరు 2016 (10:45 IST)
జపాన్‌లో భారీ భూకంపం సంభవించింది. ఇది రిక్టర్ స్కేలుపై 7.4గా నమోదైంది. ఈ భూకంపం ప్రభావం కారణంగా సునామీ రావొచ్చంటూ శాస్త్రవేత్తలు తొలుత ప్రకటించినప్పటికీ.. ఆ తర్వాత వాటిని ఉపసంహరించుకున్నారు. అయితే, ముందు జాగ్రత్త చర్యగా పలు ప్రాంతాల వాసులను ఖాళీ చేయించారు.
 
ఈ భూకంపం కేంద్రాన్ని ఈస్ట్ జపాన్‌లోని ఫుకుషిమా నగరానికి 37 కిలోమీటర్ల దూరంలో 11.4 కిలోమీటర్ల లోతులో (ఫసిపిక్ సముద్రంలో) గుర్తించారు. ప్రకంపనలు వచ్చిన వెంటనే సునామీ హెచ్చరికలను జారీచేసిన ప్రభుత్వం.. అణుశక్తి కేంద్రంతోపాటు ఈశాన్య తీరంలోని గ్రామాలను త్వరితగతిన ఖాళీచేయించే ప్రయత్నం చేసింది.
 
ఈ భూప్రకంపనల ప్రభావం ఆ దేశ రాజధాని టోక్యోలో సైతం కనిపించాయి. ప్రపంచంలో ఎక్కువగా జపాన్‌లోనే భూకంపాలు వస్తున్నాయి. 2011లో వచ్చిన భూకంపంతో ఫుకుషిమా అణువిద్యుత్తు కేంద్రం ధ్వంసమైన విషయం తెల్సిందే. ఈ భూకంపం ధాటికి 20 వేల మందికిపైగా చనిపోయారు. ఈ అణుకేంద్రాన్ని పునరుద్ధరించేందుకు కొన్ని సంవత్సరాలు పట్టింది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

చిన్న నోట్లు ఇప్పట్లో వచ్చే పరిస్థితి కనిపించడం లేదు : చంద్రబాబు అసహనం