Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

నేపాల్ - టిబెట్ బోర్డర్‌లో సరిహద్దులు : మృతుల సంఖ్య 95 మంది మృతి

Advertiesment
earthquake

ఠాగూర్

, మంగళవారం, 7 జనవరి 2025 (14:39 IST)
హిమాలయ దేశాలు నేపాల్‌-టిబెట్‌ సరిహద్దులను భారీ భూకంపం వణికించింది. మంగళవారం ఉదయం ఇక్కడ 6.8 తీవ్రతతో సంభవించిన భూకంపంలో మృతుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. ఈ విపత్తు కారణంగా టిబెట్‌లో ఇప్పటివరకు కనీసం 95 మంది మరణించినట్లు తెలుస్తోంది. ఈ మేరకు చైనా అధికారిక మీడియా వెల్లడించింది. మరో 130 మంది గాయపడినట్లు తెలిపింది. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు సమాచారం. 
 
నేపాల్‌ - టిబెట్‌ సరిహద్దుకు 93 కిలోమీటర్ల దూరంలో ఉన్న లబుచె ప్రాంతంలో మంగళవారం ఉదయం 6.35 గంటలకు ఈ భూకంపం సంభవించింది. టిబెట్‌లోని షిజాంగ్‌లో 10 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రాన్ని గుర్తించినట్లు నేపాల్‌ అధికారులు వెల్లడించారు. కొన్ని క్షణాల పాటు తీవ్రస్థాయిలో ప్రకంపనలు రావడంతో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. 
 
ఈ భూకంపం తర్వాత టిబెట్‌ రీజియన్‌లో మరో రెండుసార్లు ప్రకంపనలు చోటుచేసుకున్నాయి. వీటి తీవ్రత 4.7, 4.9గా నమోదైనట్లు అధికారులు వెల్లడించారు. భూకంప కేంద్రం ఉన్న టిబెట్‌ ప్రాంతంలో పలు భవనాలు నేలమట్టమయ్యాయి. శిథిలాల కింద పలువురు చిక్కుకున్నట్లు సమాచారం. 
 
ఈ ప్రకంపనల ప్రభావం భారత్‌లోని ఉత్తరాది రాష్ట్రాలపైనా కనిపించింది. ఢిల్లీ - ఎన్‌సీఆర్‌, పశ్చిమ బెంగాల్‌, బీహార్‌ సహా పలు ప్రాంతాల్లో భూమి కంపించినట్లు సమాచారం. అటు చైనా, భూటాన్‌, బంగ్లాదేశ్‌లోని పలు ప్రాంతాల్లోనూ ప్రకంపనలు సంభవించాయి. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

SHO లక్ష్మీ మాధవి అదుర్స్.. తప్ప తాగిన తండ్రికి కుమారుడితో బుద్ధి చెప్పారు...(video)