Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

జయలలిత డెత్ మిస్టరీ: రెండో లేఖ రాసిన గౌతమి.. మోడీ గారూ నిజం చెప్పండి..

తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత మరణంపై పలు అనుమానాలున్నాయి. ఆమె డెత్ మిస్టరీ వీడాలని.. నిజాలు మరణించకూడదంటూ సినీ నటి గౌతమి ప్రధాని నరేంద్ర మోడీకి ఇటీవల లేఖ రాశారు. ఈ లేఖతో అన్నాడీఎంకే కార్యకర్తలు,

Advertiesment
Actress Gautami still seeks answers over Jaya's death
, మంగళవారం, 13 డిశెంబరు 2016 (16:29 IST)
తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత మరణంపై పలు అనుమానాలున్నాయి. ఆమె డెత్ మిస్టరీ వీడాలని.. నిజాలు మరణించకూడదంటూ సినీ నటి గౌతమి ప్రధాని నరేంద్ర మోడీకి ఇటీవల లేఖ రాశారు. ఈ లేఖతో అన్నాడీఎంకే కార్యకర్తలు, నటుడు శరత్ కుమార్‌ల నుంచి బెదిరింపులు, విమర్శలు ఎదుర్కొన్నారు. గౌతమి అమ్ముడుపోయారని ఇలాంటి లేఖలతో ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని నటి రాధిక భర్త, నడిగర్ సంఘం మాజీ అధ్యక్షుడు, ఏడీఎంకే నేత శరత్ కుమార్ విమర్శలు గుప్పించారు. 
 
ఈ నేపథ్యంలో గౌతమి తొలి లేఖకు ప్రధాని నుంచి ఎలాంటి సమాధానం రాకపోవడంతో రెండోసారిగా రిమైండింగ్ లెటర్‌ను గౌతమి రాశారు. అందులో జయలలితకు అందించిన చికిత్సలు, ఆమె మృతి పట్ల గల అనుమానాలు ప్రజలకు తెలియాలన్నారు. 75 రోజుల పాటు అమ్మకు ఇచ్చిన చికిత్స పట్ల అపోలో ఇచ్చిన వివరాలను స్వాగతిస్తున్నా. అయితే తొలి లేఖలో తాను అడిగిన ప్రశ్నలకు సమాధానం లభించాలని ఆ లేఖలో డిమాండ్ చేశారు.
 
తాను రాసిన లేఖకు ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ నుంచి తాను సైతం ఆశిస్తున్నానని పేర్కొన్నారు. గౌతమి ఇటీవల మోడీకి లేఖ రాయడంతో ఆమెపై అన్నాడీఎంకే నుంచి ఆగ్రహం వ్యక్తమవుతోంది. అయినప్పటికీ తన భావాలను సమర్థించుకుంటూ  గౌతమి మరో లేఖను ప్రధానికి రాశారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

15గంటల పాటు లైంగిక వేధింపులు.. శాడిస్టు భర్త నుంచి వివాహితను కాపాడిన కొరియర్ బోయ్!