Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

చొరబాటుకు యత్నం.. పాక్ ముష్కరుల కాల్చివేత!

Advertiesment
loc indopak  border

ఠాగూర్

, శుక్రవారం, 9 మే 2025 (12:29 IST)
సరిహద్దులను దాటి భారత్‌‍లోకి ప్రవేశించేందుకు యత్నించిన ఏడుగురు పాక్ ప్రేరేపిత ఉగ్రవాదులు భారత సైనిక బలగాలు కాల్చివేశాయి. పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత బలగాలు ఉగ్రస్థావరాలను ధ్వంసం చేసేలా సైనిక చర్యకు శ్రీకారం చుట్టింది. దీంతో భారత్, పాకిస్థాన్ దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ప్రస్తుతం ఇరు దేశాల మధ్య తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొంది. 
 
ఈ నేపథ్యంలో మే 8వ తేదీ రాత్రి 11 గంటల సమయంలో జమ్మూకాశ్మీర్ రాష్ట్రంలోని సాంబ జిల్లాలోని అంతర్జాతీయ సరిహద్దుల వద్ద ఈ పరిణామాలు చోటుచేసుకున్నట్టు భారత సరిహద్దు దళం బీఎస్ఎఫ్ వెల్లడించింది. అక్రమంగా భారత్‌‍లోకి ప్రవేశించేందుకు ప్రయత్నించిన కనీసం ఏడుగురు ముష్కరులను బీఎస్ఎఫ్ బలగాలు కాల్చివేశాయి. దీంతోపాటు పాక్‌కు చెందిన ధన్‌బార్‌లోని పోస్టును మన దళాలు నేలమట్టం చేసింది. 
 
మరోవైపు, పాకిస్థాన్ శుక్రవారం కూడా ఇరుదేశాల నియంత్రణ రేఖ ఆవలివైపు నుంచి భారీ స్థాయిలో కాల్పులకు తెగబడింది. ముఖ్యంగా ఉరి, జమ్మూకాశ్మీర్ ప్రాంతాల్లో వీటి తీవ్ర ఎక్కువగా ఉంది. దీంతో సరిహద్దు గ్రామాల ప్రజలు ఇప్పటిక ఈ ప్రాంతాల్లోని గృహాలను ఖాళీ చేసి వెళుతున్నారు. 
 
పాక్‌తో సరిహద్దు పంచుకుంటున్న రాష్ట్రాల్లో ప్రభుత్వా అప్రమత్తంగా ఉన్నాయి. రాజస్థాన్ రాష్ట్రంలో 1037 కిలోమీటర్ల మేరకు ఉన్న పాక్ సరిహద్దును సీల్ చేశారు. ఎవరైనా సరిహద్దుల వద్ద అనుమానాస్పదంగా కనిపిస్తే కాల్చివేసే ఉత్తర్వులు జారీ చేశారు. 
 
ఇక భారత వాయుసేన నిరంతరం అప్రమత్తంగా ఉంటోంది. అలాగే, పంజాబ్ ప్రభుత్వం కూడా కీలక చర్యలు తీసుకుంది. సరిహద్దుల్లోని ఆరు జిల్లాల్లో పాఠశాలలను మూసివేసింది. వీటిల్లో ఫిరోజ్‌‍పూర్, పఠాన్‌కోట్, ఫజ్లికా, అమృతసర్, గురుదాస్‌పూర్, తార్న్‌రతరన్ స్కూళ్లను మూసివేశారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

దేశంలో ఏటీఎం‌లు మూడు రోజులు మూసివేత? ఫ్యాక్ట్ చెక్!!